Congress : ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణుల కోపం చల్లారడంలేదు. రోజు, రోజుకు పెరిగిపోతోంది. మంత్రి కొండా సురేఖ పై కొందరు నాయకులు ఫిర్యాదు చేయడంతో ఆమెను పిలిపించి మాట్లాడారు. ఇతర నేతలను కూడా కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి పిలిపించారు. ఈ నేపథ్యంలో కడియం శ్రీహరితో సహా ఇతర నేతలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించే విధానం కనబడుట లేదంటూ మల్లు రవి వద్ద వారంతా అసహనం వ్యక్తం చేశారు. మీడియా వద్ద తమపై ఇష్టాను సారంగా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ పై చర్యలు తీసుకోకుండా, మమ్మల్ని పిలిచి ప్రశ్నించడం ఏమిటంటూ మల్లు రవిని ఉమ్మడి కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.
కొండా సురేఖ ను కనీసం మందలించడం లేదు. అదుపులో పెట్టడం లేదు. ఆమె కుమార్తె పరకాల సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని, తానే రాబోయే ఎన్నికల్లో పోటీచేస్తున్నా అంటూ ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నా అదుపు చేయడం లేదు. తిరిగి ఆమెతో తిట్లు తిన్న నేతలను పిలిపించడంతో నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఇంత అసంతృప్తి ఉన్నప్పటికీ పార్టీ అధికారం లో ఉన్న నేపథ్యంలో పార్టీని వదిలి వెళ్లే వారు ఎవరు లేరు. స్థానిక ఎన్నికల భాద్యతలు వారిపై కూడా ఉన్నవి. జిల్లా మంత్రిగా కొండా సురేఖ ఉన్నప్పటికీ ఎవరి నియోజక వర్గం భాద్యతలు వాళ్ళకే ఇవ్వాలంటున్నారు. మా నియోజక వర్గం లో ఆమె జోక్యం ఉండరా దంటున్నారు. మా నియోజక వర్గాల్లో అడుగుమోపితే సహించేదిలేదని ముక్కు సూటిగా ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు మల్లు రవి వద్ద తేల్చేశారు.