MLC Kavitha : ఇంటిపోరుతో భారత రాష్ట్ర సమితి పార్టీ గత కొద్ధి రోజుల నుంచి కొట్టుమిట్టాడుతోంది. ఉద్యమం నడిచినన్ని రోజులు కుటుంబంలో ఎక్కడా తేడా రాలేదు. అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో కూడా ఎప్పుడు పొగ రాలేదు. ఒకవేళ చిన్న, చిన్న సమస్యలు వచ్చినా బయటకు పొక్కలేదు. కానీ అధికారం పోయిన తర్వాత ఎమ్మెల్సీ కవిత అధినేత కేసీఆర్ కు రాసిన లేఖ తో విభేదాలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. ఇప్పుడు ఆమె జాగృతి పేరుతో తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం చేస్తోంది. ఈ పోరాటం కాస్తా బిఆర్ఎస్ కంటే ముందుగానే చేపడుతోంది కవిత. ఇది పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
మా నాయకుడు కేసీఆర్, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఇటీవల ప్రకటించింది. ఇదే నెలలో బీసీ సాధన కోసం రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టింది. అడపాదడపా ఢిల్లీ పై ధ్వజమెత్తుతోంది. ఎదో ఒక రాజకీయ ప్రకటన చేస్తూ కవిత తన ఉనికిని చాటుకుంటోంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజకీయ ప్రకంపనలు సృష్టించారు.
తెలంగాణకు మీరు ముఖ్యమంత్రి అవుతారా అని ప్రశ్నించగా తప్పకుండా అంటూ బదులివ్వడం విశేషం. రాబోయే పది పదిహేనేళ్ళల్లో తాను సీఎం కావడం పక్కా అంటూ ధీమాగా చెప్పేశారు. రాజకీయాల్లో ఎదగాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు. అందులో తప్పేమి లేదంటున్నారు కవిత. తన లక్ష్యం ఏమిటనేది కవిత చెప్పకనే చెప్పేశారు.
పొలిటికల్ బ్యూరో,
కొమ్మెర అనిల్ కుమార్, ఎమ్మే, బీఎడ్.