కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండోసారి సీఎం పదవి చేపట్టడానికి విస్తృత ప్రచారం చేస్తున్నాడు. ప్రతిపక్షాలను ఒంటరిగానే ఎదుర్కొంటున్నాడు.ఎక్కడ కూడా పొత్తులకు వెళ్ళలేదు. బీజేపీ,తెలుగుదేశం,జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.ఈ కూటమి జగన్ ను ఎలాగయినా ఇంటికి పంపాలని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు.అదేవిదంగా సొంత చెల్లెలు,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తన అన్న తోనే పోరాటం చేస్తోంది.తెలంగాణలో పార్టీ పెట్టి కేసీఆర్ పై పోరాటం చేస్తూనే పాదయాత్ర చేపట్టింది.రాజకీయ ప్రకంపనాల నేపథ్యంలో షర్మిల పుట్టింటికి వచ్చి తండ్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడవడానికి నిర్ణయం తీసుకొంది.కాంగ్రెస్ కండువా కప్పుకొని ఏకంగా తన అన్న నే లక్ష్యముగా చేసుకొని బరిలోకి దిగింది.జగన్ ఒకవైపు ఇంటి పోరుతో సతమతమవుతుండగా, మరోవైపు కూటమి పోరును ఎదుర్కోక తప్పడంలేదు.
ప్రతిపక్ష హోదాలో ….
రాష్ట్రము విడిపోయాక మొదటిసారి తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు.ఆ ఐదేళ్ల కాలంలో ప్రతిపక్ష హోదాలో విమర్శలకు జగన్ సమయం కేటాయించాడు.ఎక్కడ ఈ చిన్న విషయం దొరికిన దాన్ని బూతద్దంలో చూసేది.అటువంటి జగన్ నాటి ప్రవర్తనకు,నేటి ప్రవర్తనకు ఎంతో తేడా ఉందనే అభిప్రాయాలు ఓటర్లలో వ్యక్తం కావడం విశేషం.తాజా ఎన్నికల ప్రచారంలో జగన్ విసురుతున్న మాటలను వింటున్న ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ప్రతిపక్ష హోదాలో విమర్శలు చేసింది ఆయనే,అధికార హోదాలో ఇప్పుడు మాట్లాడుతున్నది ఆయనే. కానీ అప్పటికి,ఇప్పటికి ఆయన మాటల్లో ఎంతో తేడా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్టీల్ ప్లాంట్ ఏమయ్యింది….
కడప జిల్లా నిరుద్యోగులకు వరంలా స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నా అని భారీ ఎత్తున ప్రచారం చేసుకున్నాడు.కానీ నేటి ఎన్నికల ప్రచారంలో ఆ ఫ్యాక్టరీ గురించి ఎక్కడ కూడా ప్రస్తావించకపోవడం పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.ఇప్పుడు స్టీల్ కంపెనీ పనులు ఎక్కడికి వరకు పూర్తయ్యాయి. ఎప్పుడు పూర్తవుతుంది.ఎంత మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే విషయాలను జగన్ తన ప్రచారంలో మాట్లాడకపోవడంపై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు స్టీల్ కంపెనీ పూర్తి చేసే ఉద్దేశ్యం ఉన్నదా,లేదా అనేది కూడ అనుమానంగానే ఉందంటున్నారు కడప ప్రజలు.నేటి ఎన్నికల ప్రచారంలో మాత్రం జగన్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావించకపోవడం పై అస్నాతృప్తి నిరుద్యోగుల్లో వ్యక్తం అవుతోంది.
పోలవరం ప్రాజెక్ట్….
ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు జగన్ పోలవరం ప్రాజెక్ట్ గురించి వీలు దొరికినప్పుడల్లా అధికార పార్టీని విమర్శిస్తూనే ఉండేది.ఎక్కువగా ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లో సమావేశాలు ఏర్పాటుచేసేది.ఆ ప్రాజెక్ట్ పూర్తయితేనే ప్రజలు అభివృద్ధిచెందుతారని మాట్లాడేది.ప్రాజెక్ట్ పనుల గురించి కూడా జగన్ ప్రచార సభల్లో మాట్లాడుతలేడు. ఒకవేళ మరోసారి అధికారం చేపడితే ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తాను అని చెప్పడం లేదు. పనులు ఎంతవరకు పూర్తయ్యాయి అనేది స్పష్టం చేయడం లేదు.
ప్రత్యేక హోదా….
ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ గొప్పగా మాట్లాడాడు జగన్.ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదంటూ తన పార్లమెంట్ సభ్యులతో పదవులకు రాజీనామా చేయించాడు.జగన్ కూడా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నాడు.కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడక పోవడం పై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-