Home » కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు

కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న కాంగ్రెస్ నాయకురాలు

కోల్ బెల్ట్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కోట్ల రూపాయల అప్పు ఉన్నట్టు ప్రకటించింది.నిల్వ ఆస్థి,రాబడి ఉన్నప్పటికీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని ఆమె బహిరంగంగానే వెల్లడించింది.అప్పులు బయట తీసుకోలేదు.తన కుటుంబ సభ్యుల వద్దనే తీసుకున్నట్టు తెలిపింది.ఇన్ని అప్పులు పెట్టుకొని పార్లమెంట్ అభ్యర్థిగా పోటీచేస్తోంది.అప్పులు ఉన్న నాయకురాలు ఎన్నికల ఖర్చు కోసం మరింత అప్పుచేయక తప్పదనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.కడప పార్లమెంట్ స్థానం కు అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ నాయకురాలు ఎవరంటే
ఆస్తుల విలువ…
కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆమె కడప లోకసభ స్థానంకు పోటీచేస్తున్న నేపథ్యంలో నామినేషన్ వేశారు.ఎన్నికల అధికారికి నామినేషన్ పాత్రలతోపాటు ఆస్తులు,అప్పుల వివరాలను కూడా పొందుపరిచారు.తనకు సొంతంగా 182.82 కోట్ల విలువైన నికర ఆస్తులు ఉన్నాయని నామినేషన్ లో వివరించారు. స్థిరమైన ఆస్తుల విలువ 9.29 కోట్ల విలువైనవి ఉన్నాయి, 123. 26 కోట్ల విలువైన చరాస్తులు కలిగి ఉన్నానని తన నామినేషన్ పత్రంలో పొందుపరిచింది. అదేవిదంగా వీటితోపాటు బంగారు నగల విలువ 3.69 కోట్లు ఉంటుంది.వజ్రాల విలువ 4.61 కోట్లు ఉంటుందని వైఎస్ షర్మిల తన నామినేషన్ వేసిన సందర్బంగా ప్రకటించింది.
తినుకున్న అప్పులు ….
తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం కుటుంబ సభ్యుల వద్ద అప్పు తీసుకున్నట్టు తన ఎన్నికల ఆఫిడవిట్లో వైఎస్ షర్మిల తెలిపింది.రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్ద 82.58 కోట్లు తీసుకున్నానని తెలిపింది.జగన్ భార్య, తన వదిన అయినటువంటి భారతి వద్ద 19.56 లక్షల అప్పు చేసినట్టుగా తన అఫిడవిట్ లో పేర్కొంది. అదేవిదంగా తన భర్త అనిల్ కుమార్ నా యొక్క తల్లి విజయమ్మ వద్ద 40 లక్షల రూపాయలను అప్పుగా తీసుకున్నాడని పేర్కొంది.వాటితోపాటు బ్రదర్ అనిల్ నా వద్ద కూడా 30 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకోవడం జరిగిందని కడప పార్లమెంట్ స్థానం కు పోటీచేస్తున్న సందర్బంగ నామినేషన్ పత్రంలో వివరించింది.

—————————
ఎడిటర్: పీఆర్ యాదవ్
9603505050
—————————-

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *