ఇండియాలో యూట్యూబ్ కొత్త నిబంధనలు
ఆ టైటిల్స్, థంబ్‌నెయిల్స్ పెడితే కఠిన చర్యలు
మార్పురాకుంటే క్రియేటర్ల పై కఠిన చర్యలు
you tube : ప్రముఖ వీడియో సంస్థ యూట్యూబ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రజాధరణ పొందింది. కంటెంట్ క్రియేటర్లు చాలామంది తమ క్రియేటివిటీతో ఉపాధి పొందుతున్నారు. ఉపాధి కోసం అనేక మంది యూట్యూబ్‌ను వేదికగా చేసుకున్నారు. దింతో కోట్ల కొద్దీ వీడియోలు యూట్యూబ్‌లో చూస్తున్నాం. అతి తక్కువ సమయంలో అధికంగా సంపాదించాలనే ఆశతో కొందరు తప్పుగా వ్యవహరిస్తున్నారు.
టైటిల్‌తో సంబంధం లేని వీడియోలను, మిస్లీడింగ్ థంబ్ నెయిల్స్ అప్ లోడ్ చేస్తున్నారు. నిజమే అనుకొని వ్యూయర్స్ చూసి నిరాశకు లోనవుతున్నారు. ఈ విధానం వలన యూట్యూబ్ పై ఉన్న నమ్మకం పోతోంది. ఈ నేపథ్యంలో అటువంటి వీడియోలపై కఠిన చర్యలు తీసుకోడానికి యూట్యూబ్ నిర్ణయం తీసుకొంది. తప్పుడు సమాచారం ఇస్తూ వ్యూయర్స్ సమయాన్ని వృధా చేస్తున్న వీడియోలను తొలగించే పనిలో యూట్యూబ్ నిమగ్నమైనది.
ప్రధానంగా భారత్‌లోనే ఇలాంటి తప్పుదారి పట్టించే టైటిల్స్, థంబ్‌నెయిల్స్ ఎక్కువగా ఉన్నాయని యూట్యూబ్ గుర్తించింది. అటువంటి వాటిని ‘క్లిక్‌బైట్’గా పరిగణిస్తామని కూడా యూట్యూబ్ ప్రకటించింది. ఇప్పటి నుంచి మొదటి ప్రాముఖ్యత న్యూస్, కరెంట్ అఫైర్స్ కంటెంట్‌కు ఇస్తామని ప్రకటించింది. ఇటువంటి మిస్లీడింగ్ కంటెంట్‌ను తొలగించడం ద్వారా తమ సంస్థపై వినియోగదారుల విశ్వసనీయత మరింత పెరుగుతుందని తెలిపింది.
ఉదాహరణకు..సీఎం తన పదవికి రాజీనామా వంటి టైటిల్ ఉన్న వీడియోలు ఎక్కుగా వ్యూయర్స్ ను ఆకర్షిస్తాయి. కానీ వీడియోలో మాత్రం రాజీనామా సారాంశం ఏమాత్రం ఉండదు. టైటిల్‌కి సంబంధం లేని కంటెంట్‌ను అప్ లోడ్ చేస్తే వాటిని ‘Exaggerated Clickbait’ కేటగిరీ కింద గుర్తించి ఆ వీడియోలను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది యూట్యూబ్ సంస్థ. అదే విదంగా కొందరు టాప్ పొలిటికల్ న్యూస్ అని థంబ్‌నెయిల్స్ పెడుతున్నారు. అటువంటి వాటిలో కూడా సంబంధంలేని విషయం ఉంటోంది. వాటిని కూడా గుర్తించి తొలగిస్తామని తెలిపింది.
యూట్యూబ్ ఈ కఠినమైన చర్యలను మరికొద్ది రోజుల్లేనే ఇండియాలో అమలు చేయదానికి నిర్ణయం తీసుకొంది. ఎవరైతే తప్పుడు థంబ్‌నెయిల్స్, టైటిల్‌తో సంబంధం లేని వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారో వాటిని తొలగించడానికి వారికి కొంత సమయం కూడా ఇవ్వనుంది యూట్యూబ్ సంస్థ. అయినప్పటికీ మరోసారి తప్పుడు కంటెంట్‌నే పోస్ట్ చేస్తే ఆ ఛానెల్‌కు సంబంధించిన కంటెంట్ క్రియేటర్‌పై జరిమానా విధించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిసింది. కొత్త నిబంధనలను పాటించని కొత్తగా వచ్చే క్రియేటర్ల ఛానెల్స్‌ను హెచ్చరించకుండానే తొలగించడానికి కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.