Home » Milk : రోజూ ఓ కప్పు పాలు.. ఐదు పదార్థాలు…తాగితే… డాక్టర్ అవసరమే లేదు

Milk : రోజూ ఓ కప్పు పాలు.. ఐదు పదార్థాలు…తాగితే… డాక్టర్ అవసరమే లేదు

Milk : ఆరోగ్యానికి పాలు చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు ఉదయం పూట తాగుతారు. మరికొందరు రాత్రి పూట తాగుతారు. కానీ ఒక కప్పు పాలల్లో ఈ ఐదు పదార్థాలను కలిపి తాగితే డాక్టర్ అవసరమే లేదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

దాల్చిన చెక్క పొడిని పాలల్లో కలిపి తాగితే నిద్రలేమి సమస్య దూరమవుతుంది. ఆందోళన, ఒత్తిడి కూడా దూరమవుతాయి. పాలల్లో బాదం పొడి కలిపి తాగితే మెదడు, గుండె, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.

పండ్ల ముక్కలతో కలిపి పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. శరీరంలోని బలహీనత తొలగిపోతుంది.

పాలల్లో పసుపు పొడి కలుపుకొని తాగితే చాలా మేలు కలుగుతుంది. సీజనల్ వ్యాధులు రావు. జలుబు, దగ్గు నయమవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పాలల్లో ఏలకుల పొడి కలుపుకొని తాగితే శరీరాన్ని ఉతేజపరుస్తుంది. పోషకాలు పుష్కలంగా అందుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు, తలనొప్పి, తుమ్ములు నయమవుతాయి.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *