Ayyappa : కేరళ రాష్ట్రంలోని అయ్యప్ప స్వామిని నమ్ముకున్న భక్తులు పోటెత్తుతున్నారు. దింతో శబరిగిరులు అయ్యప్ప భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ నేపథ్యంలో శబరిమల ఆదాయం కూడా పెరిగిందని ఆలయ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు వచ్చిన ఆదాయ గణాంకాల ప్రకారం రూ.22.76 కోట్లు పెరిగినట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. డిసెంబర్ 15 వరకు 22 లక్షల మంది అయ్యప్ప భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి. డిసెంబర్ 15 వరకు ఆదాయం రూ.163.89 కోట్లు సమకూరినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది ఆలయం ఆదాయం రూ.22.76 కోట్లు పెరిగినట్లు అధికార గణాంకాలు ప్రకటించాయి. డిసెంబర్ 15 వరకు 30 రోజుల్లో 22 లక్షల పైబడి అయ్యప్ప భక్తులు శబరిమలను దర్శించుకోవడంతో రూ.163.89 కోట్లన ఆదాయం సమకూరిందని ఆలయం అధికారులు ప్రకటించారు. అరవణ అమ్మకాల ద్వారా గత ఏడాది కంటే అదనంగా రూ.17.41 కోట్ల ఆదాయం పెరిగింది. ప్రసాదం విక్రయం ద్వారా రూ.82.67 కోట్లు, కానుకల రూపంలో రూ.52.27 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిలో మొత్తం ఆదాయం రూ.163.89 కోట్ల ఆదాయం దేవస్థానం కు వచ్చినట్టు అధికార గణాంకాలు ప్రకటించాయి.