Home » Paneer : పనీర్ తో ప్రయోజనాలు ఎన్నో తెలుసా ?

Paneer : పనీర్ తో ప్రయోజనాలు ఎన్నో తెలుసా ?

Paneer : శాకాహార భోజన ప్రియులకు పనీర్ కూర ఇష్టంగా తింటారు. కొందరు ఇష్టపడరు. అందులో ఉండే పోషకాలతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. కానీ చాలా మందికి తెలియదు. పనీర్ లో ఉండే పోషకాలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పనీర్‌లో విటమిన్‌ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. తినే ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే శరీరానికి అనేక లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు బలహీనపడే వ్యాధులను దూరం చేస్తుంది. పన్నీర్‌లో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

పన్నీర్ శాకాహారులకు మంచి ప్రోటీన్, ఇది శరీరంలోని కణజాలాలను నిర్మించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. కండరాల పెరుగులకు సహాయపడుతుంది.పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గడమే కాకుండా కండరాలు దృఢంగా తయారవుతాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది. సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. గుండె సమస్యలతో బాధపడేవారు కూడా క్రమం తప్పకుండా పన్నీర్‌ను తినడం చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. విటమిన్ B12 మూలం. ఇది మెదడు ఆరోగ్యానికి అవసరం. ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *