Rope Way : మావోయిస్టుల ఏరివేతనే ప్రధానంగా ఎంచుకొని కేంద్ర పోలీస్ బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. ఇటీవల మావోయిస్టుల ఏరివేతలో ఒక్క నెలలోనే జరిగిన ఎన్కౌంటర్ లల్లో 120 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. మావోయిస్టులను పూర్తిగా అంతం చేయడానికి నిరంతరం దండకారణ్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. అడవుల్లో చేపట్టే కూంబింగ్ సత్పలితాలు ఇస్తున్నప్పటికీ ఆకాశ మార్గాన కూడా బలగాలు జల్లెడ పడుతున్నాయి. డ్రోన్ ల సహాయం కూడా తీసుకుంటున్నాయి. రాబోయే వర్షాకాలం లో వాళ్ళను గుర్తు పట్టడం పోలీస్ బలగాలకు కొంత మేరకు కష్టమే అవుతుంది. చెట్లు వర్షకాలంలో చిగురిస్తాయి. మావోయిస్టులు కూడా ఆలివ్ గ్రీన్ దుస్తులే ధరిస్తారు. కాబట్టి వాళ్ళను గుర్తించడం బలగాలకు ఇబ్బంది అవుతుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల సరిహద్దుల్లోని చింత వాగుపై పెద్ద ఎత్తున రోప్ వే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆ రోప్ వే ద్వారా బలగాలు నిరంతరం కూంబింగ్ చేపడుతున్నాయి. అత్యంత మావోయిస్టు ప్రాబల్య ప్రాంతమైన పామెడు దండకారణ్యంలో CRPF బలగాలు మోహరించాయి. CRPF బలగాలు చింతవాగుపై భారీ రోప్‌వే ను నిర్మించారు.సుమారు రెండు వందల మీటర్ల కు పైగా పొడవుతో భారీ రోప్ వే నిర్మాణం అడవిలో చేపట్టారు. పోలీస్ భద్రతా బలగాల రాకపోకలు ఈ రోప్ వే తోనే కొనసాగుతున్నాయి.
తెలంగాణ సరిహద్దు వెంట సుమారు 20 కిలోమీటర్లు ఈ చింతవాగు ఉంటుంది. కీకారణ్యం అవతల ఉన్న గ్రామాల ప్రజలు వర్షాకాలంలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కేంద్ర పోలీస్ బలగాలు దండకారాణ్యాన్ని జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే మావోయిస్టుల ఆయుధ తయారీ కర్మాగారాలు ధ్వంసం అయ్యాయి. నిరంతరం పోలీస్ బలగాలు దండకారుణ్యాన్ని వదల కుండా జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల సంఖ్య రోజు రోజుకు తగ్గు ముఖం పడుతోంది. బలగాలు పైచేయి సాధిస్తూ దండకారణ్యంలో దూసుకు వెళుతున్నాయి.