ఒత్తిడిని తగ్గిస్తుంది
ఆరోగ్యాన్ని కాపాడుతుంది
పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్
Police : ప్రతి ఒక్కరూ ధ్యానాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ స్పష్టం చేశారు. ధ్యానం ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందని అన్నారు. శనివారం తన కార్యాలయంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం పురస్కరించుకొని తొలి ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన కమిషనరేట్ పరిధిలోని అధికారులు, సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.
యోగా అనేది మన ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన ఆధ్యాత్మిక మరియు భౌతిక అభ్యాసం. ఈ ఆధునిక కాలంలో ధ్యానం, యోగ విశ్వ వ్యాప్తమవుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నిత్యం ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత పొందడంతో పాటు శరీరం కూడా ఆరోగ్యముగా తయారవుతుందన్నారు. కేవలం జిమ్ లో శారీరకంగా వ్యాయామం చేయడం, ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడం ఒక్కటే శరీరానికి, మెదడుకు సరిపోదన్నారు. మెదడు కూడా ఆరోగ్యముగా ఉండాలంటే యోగ, ధ్యానం కూడా తప్పని సరన్నారు.
మన శాఖలో ప్రతి ఒక్కరికి ఉద్యోగ బాధ్యతల పరంగా ఎంతో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి ఉపశమనం కలగాలంటే ధ్యానం తప్పనిసరన్నారు సీపీ ఎం శ్రీనివాస్. ధ్యానం, ప్రాణాయామం, సుదర్శన క్రియ యోగా చాలా ముఖ్యమైనవి. ఇవి అన్ని రకాల ఒత్తిడి, బాధలను తొలిగిస్తాయి. ఫలితంగా, పని చేస్తున్నప్పుడు మీకు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా తాజాగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అన్నారు. మన దైనందిన జీవితం ఆనందకరంగా, ప్రశాంతంగా మార్చుకోవడానికి యోగా, ధ్యానం మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలని కోరారు
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలంటీర్లు ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపయోగాల గురించి, ధ్యానం ఏ విధంగా చేయాలి ఎప్పుడు చేయాలి నియమ నిబంధనలు, తదితర అంశాల గురించి అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏ ఓ శ్రీనివాస్, ఆర్ ఐ లు శ్రీనివాస్, సంపత్, మల్లేశం, సూపరింటెండెంట్ ఇంద్రసేన రెడ్డి, ఆర్ఎస్ఐ అనిల్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆర్గనైజేషన్ వాలింటీర్స్ రామ్ మోహన్ బండా, ఓం ప్రకాష్, సీపీ కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.