Party Office Change : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ గోరపరాజయాన్ని మూట గట్టుకొంది. ఊహించని మెజార్టీ సాధించుకొని అబాసుపాలైనది. సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకొని ప్రజల తీర్పు కోరిన వైసీపీ నేతల ఆశలు అడియాశలయ్యాయి. మహిళల ఓట్లపై ధీమాలో ఉన్నప్పటికీ గెలుపు సాధ్యం కాలేదు. గడిచిన ఐదేళ్లు తిరుగులేదంటూ ప్రవర్థించారు. రాబోయే ఐదేళ్లు ఇప్పుడు వనవాసం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఓటమిపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో కీలక నేతలతోపాటు, తాజా ఎన్నికల్లో గెలిచిన నాయకులు ఉన్నారు. సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్నినాని, కొడాలినాని, గురుమూర్తి, శివప్రసాద్‌రెడ్డి, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్‌లతో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 మంది అభ్యర్థులు గెలవడంతో పార్టీ పరిస్థితి చెప్పుకోలేని విదంగా తయారైనది. పార్టీ పరాజయంకు కారణాలు ఏమిటి. పొరపాటు ఎక్కడ జరిగింది. అభ్యర్థులను ఓడించిన విధానాలు ఏమిటి. ఓటర్లను ఏయే అంశాలు ప్రభావితం చేశాయి. అనే విషయాలపై జగన్ సమీక్ష చేపట్టారు.
సమావేశంలో ఓటమికి గల కారణాలను తెలుసుకుంటూనే పార్టీ కార్యాలయాన్ని కూడా ప్రస్తుతం ఉన్న ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. దింతో సమావేశంలో ఉన్న నాయకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. తాడేపల్లి లో ప్రస్తుతం జగన్ నివాసం ఉంటున్నారు. నివాసం పక్కనే జగన్ క్యాంపు కార్యాలయం ప్రస్తుతం కొనసాగుతోంది. అందులోకి పార్టీ కార్యాలయాన్ని మార్చాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. జూన్ పదో తేదీ నుంచి అక్కడే పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని వైసీపీ అధినేత జగన్ నేతలను ఆదేశించారు. ఇప్పుడు వైసీపీ పార్టీ ప్రధాన కార్యాలయంగా క్యాంప్ కార్యాలయం మారిపోయింది.
కూటమి అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు జరగడంతో జగన్ సమావేశంలోఆందోళన వ్యక్తం చేశారు. జరుగుతున్న దాడులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. దాడులను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేయడానికయినా పార్టీ సిద్ధంగా ఉందని సమావేశంలో జగన్ స్పష్టం చేసి నాయకుల్లో భరోసా నింపారు.