Home » kumbamela : కుంభమేళాకు వెళ్ళాడు… పోలీసులకు చిక్కాడు.

kumbamela : కుంభమేళాకు వెళ్ళాడు… పోలీసులకు చిక్కాడు.

kumbamela : చేసిన పాపాలను తొలగించు కోవాలనుకున్నాడు. ఆ పాపాలు పోవాలంటే ఏమి చేయాలి. కుంభమేళా గంగా నది లో పుణ్య స్నానం చేయాలి. అయితే అక్కడికే వెళ్ళాలి అనుకున్నాడు ఒక వ్యక్తి. వెళ్ళాడు. గంగానదిలో స్నానం చేయడానికి సిద్దమయ్యాడు. ఇంతలోనే ఆయన కోసం వెతుకుతున్న వారు పట్టుకున్నారు. ఇది ఎక్కడో కాదు నిజంగా కుంభమేళాలో జరిగిన సంఘటన. ఆ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ఏడాదిన్నర కాలం నుంచి పోలిసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు మద్యంస్మగ్లర్ ప్రవేశ్ యాదవ్. ఇతను రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నివాసి. 2023, జూలై 29న జాతీయ రహదారి-19పై వాహనాల తనిఖీలు చేస్తుండగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ప్రవేశ్ యాదవ్ పట్టుబట్టాడు.

ఆ తరువాత బెయిల్ పై వచ్చిన నాటి నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడని పోలీస్ వర్గాలు తెలిపాయి. అతనిపై నిఘా పెట్టడంతో కుంభమేళాకు వెళుతున్నట్టుగా పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ నేపథ్యంలో కుంభమేళాలో ప్రవేశ్ యాదవ్ ను పోలీసులు పట్టుకున్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *