Bibipeta : బీబీపేట గ్రామ పంచాయితీ పరిధిలో నిర్వహించే సంతకు శుక్రవారం గ్రామ పంచాయితీ అధికారులు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో గ్రామ పంచాయితీకి రూ : 3,33,000 వేలం వేయగా, రూ : 2,03,000 వేలం దక్కింది. ఈ వేలం పాటను గ్రామ పంచాయితీ ఈఓ రమేష్ నిర్వహించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడుతూ రోజువారీగా కూరగాయలు అమ్మేవారు ఇరువై రూపాయలు, నాలుగు చక్రాల వాహనం వారు 80 రూపాయలు, ఆరు చక్రాల వాహనదారులు 100 రూపాయలు చెల్లించాల్సి ఉందన్నారు.
ఈ వేలంపాటలో ఏడుగురు సభ్యులు పాల్గొన్నారు. వారితో పాటు మాజీ సర్పంచ్ లక్ష్మి, మాజీ ఉప సర్పంచ్ సాయి, గ్రామ పెద్దలు భూమా గౌడ్, సుతా రమేష్, మాజీ ఎంపిటిసి కొరివి నీరజ నర్సింహులు, బాయికాడి బాలయ్య, మందు గారు మహేష్, రంజిత్ గౌడ్ ,రాముల గౌడ్, దేవరాజ్, పరకాల రవి, కటికే రాజు, మల్లేశం, దేవుని పల్లె శీను, దుంప నర్సింలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.