walking : నడవడానికి చాలా మంది వివిధ రకాల చెప్పులు వాడుతారు. కొందరు బూట్లు వాడుతారు. కానీ చెప్పులు లేకుండా నడిస్తే ఏమవుతుంది అనే విషయాలను ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు. వాటి గురించి తెలుసుకుందాం…..
చెప్పులు లేకుండా నడవడం పాదాల ఆరోగ్యానికి మంచిది. ఎక్కువసేపు బహిరంగ ప్రదేశాలలో చెప్పులు లేకుండా నడవడం వల్ల పాదాలకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. కఠినమైన ఉపరితలాలపై వేడి, పదునైన వస్తువులపై నడవడం వల్ల గాయాలు జరుగవచ్చు.
చెప్పులు లేకుండా నడిచినప్పుడు పాదాల కండరాలు సహజంగా కదులుతాయి. నడక క్రమంలో తుంటి, మోకాళ్ళపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మన పాదాల్లో ఉండే నరాలు మెదడుకు కీలకమైన సమాచారాన్ని పంపిస్తాయి. కండరాలను బలపరచడంలో సహాయపడుతుంది.
బూట్లు ఉపయోగించడం మంచిదే అయినప్పటికీ వాటి వల్ల పాదాల కండరాలు బలహీనపడతాయి. సరిపోని బూట్లు, హై హీల్స్ వంటి వాటి వల్ల పాదాలపై ఒత్తిడి పెరిగి గాయాలు కలగవచ్చు. ఎక్కువ సేపు బూట్లు ధరించడం వల్ల కండరాలు బలాన్ని కోల్పోతాయి.