walk : ఆరోగ్యం కాపాడుకోడానికి ఈ రోజుల్లో చాలా మంది ఉదయం నిద్రలేవగానే వ్యాయామం చేస్తారు. కొందరు జిమ్ కు వెళుతారు. మరికొందరు ఇంటిలోనే వ్యాయామం చేస్తారు. కొందరు మైదానంలో వాకింగ్ చేస్తారు. ఉదయం నడక చేయడంతో పలు లక్షణాలు కనిపిస్తే వారికి డయాబెటిస్ వ్యాధి ఉన్నట్టేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…..
కొద్దిసేపు నడిచిన తర్వాత కూడా అధికంగా అలసిపోయినట్టు, బలహీనంగా అనిపిస్తే, అది రక్తంలో చక్కెర అసమతుల్యత వల్ల అవుతుంది. హైపర్ గ్లైసీమియా – హైపోగ్లైసీమియా రెండూ తీవ్ర అలసటకు కారణమే అవుతాయి. ఎందుకంటే అధిక రక్తంలో చక్కెర స్థాయిలు శరీరం గ్లూకోజ్‌ను సమర్థవంతంగా పనిచేయడానికి ఇబ్బంది అవుతుంది.
కొద్ది దూరం నడిచిన తర్వాత కాళ్ళ నొప్పులు ఏర్పడితే డయాబెటిక్ కి సంకేతం. నడవడం వలన పాదాలు, కాళ్ళకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీని వలన నడుస్తున్నప్పుడు కాళ్లు, తొడలు లేదా పిరుదులలో నొప్పి, తిమ్మిర్లు కూడా వచ్చే అవకాశం ఉంది.
నడుస్తున్నప్పుడు కాళ్ళలో జలదరింపు ఏర్పడుతుంది. చేతులు, కాళ్ళలోని నరాలు చచ్చుబడిపోతాయి. పాదాల్లో మంట లేదా సూదులతో గుచ్చినట్లు అనుభూతిని కలిగిస్తుంది. నెమ్మదిగా అది పూర్తి స్థాయిలో తిమ్మిరిగా మారవచ్చు. ఈ లక్షణాలు డయాబెటిస్ కు కారణం అవుతాయి.
పాదాలు, చీలమండలంలో ద్రవాలు ఏర్పడుతాయి. వాపు వస్తుంది. నడుస్తుంటే బూట్లు బిగుతుగా అవుతాయి. కాళ్ళు వాచిపోతాయి. నడుస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఏర్పడితే డయాబెటిస్ సమస్య ఏర్పడినట్టుగా భావించాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.