coconut : కొబ్బరి నీళ్లు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ళల్లో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి సమపాళ్లలో అందించి ఆరోగ్యముగా ఉంచుతాయి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు తాగడం ద్వారా శరీరానికి హైడ్రేషన్ లభిస్తుంది.
కొబ్బరి నీళ్లు తక్కువ కేలరీలతో ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి చాలా సహాయపడుతుంది. పచ్చి కొబ్బరి కాయలలో ఉండే కొబ్బరి నీళ్లు విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో నిండుగా ఉంటాయి. కొబ్బరి నీళ్లలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి.
కొబ్బరి నీళ్లు శరీరానికి తేలికైన సహజ కార్బోహైడ్రేట్లు అందిస్తాయి. అధిక ఉష్ణోగ్రతల్లో కూడా శక్తిని ఉంచడం కొబ్బరి నీళ్లతో సులభంగా సాధ్యమవుతుంది. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారికి ఇది గొప్ప సహాయకారిగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జుట్టు పెరుగుదల సజావుగా జరుగుతుంది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె, కండరాలు, ఎముకల బలానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి.