break fast : ఉదయం నిద్ర లేవగానే కొందరు కాఫీ తాగుతారు. కొందరు పళ్ళు తోమిన తరువాతనే కాఫీ లేదంటే, టి తాగుతారు. మరికొందరు హార్లిక్స్, బూస్ట్ కలిపిన పాలు తాగుతారు. వీటిలో ఏదయినా ఒకటి తాగిందంటే మధ్యాహ్నం భోజనం సమయం వరకు ఏమి తినరు. అంటే అల్ఫాహారం కూడా ముట్టరు. ఇలా ఒక నెల బ్రేక్ ఫాస్ట్ ముట్టకుండా ఉంటె ఏమవుతుందో తెలుసా ? శరీరానికి ఎంతో నష్టం. అల్ఫాహారం తింటేనే శరీరానికి బోలెడు లాభాలు ఉన్నాయని పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు.
వైద్య నిపుణల పరిశోధనల మేరకు…. మానసిక స్థితిని చాలా వరకు ప్రభావితం చేస్తుంది. నెల రోజులపాటు బ్రేక్ ఫాస్ట్ చేయకుంటే చిరాకు, ఆందోళన, నిరాశ లక్షణాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి.
బరువు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ అనారోగ్యకరమైన బరువు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. బ్రేక్ ఫాస్ట్ తినని వాళ్ళు మధ్యాహ్నం అన్నం ఎక్కువగా తింటారు. దీనివలన బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అల్ఫాహారం చేయకపోవడం వలన గుండె జబ్బులు, డయాబెటిస్, రక్తపోటు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉదయం అల్ఫాహారం శరీరానికి తగినంత పోషకాలను అందిస్తుంది.
అల్ఫాహారం తినకపోవడం వలన శరీరంలో విటమిన్లు, మినరల్, ఫైబర్ వంటి శరీరానికి అవసరమైన పోషకాలు లోపిస్తాయి. దీనివలన అనేక రకాల వ్యాదులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.