Nalla Nuvvulu : రైతు పండించే నువ్వులు రెండు రకాలు. ఒకటి తెల్ల నువ్వులు. రెండో రకం నల్ల నువ్వులు. సాధారణంగా తినడానికి తెల్ల నువ్వులే ఎక్కువగా వాడుతాం. వాటికంటే నల్ల నువ్వులే మన శరీరానికి ఎక్కువ మేలు చేస్తాయని వైద్య శాస్త్రంలో చెప్పబడింది.
నల్ల నువ్వుల్లో శక్తివంతమైన రోగనిరోధక మాడ్యులేటర్, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్తీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఆస్తమా, గొంతు నొప్పి, దగ్గు, జలుబు సమస్యలతో ఇబ్బంది పడేవారు నువ్వులు వేయించుకొని తినడం వలన ఉపశమనం కలుగుతుంది.
కడుపులో మంటను తగ్గిస్తుంది. సైనసైటిస్ సమస్యను తగ్గిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తినడం వలన ఆరోగ్యవంతులవుతారు. బ్లడ్ షుగర్ నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్ కూడా అదుపులో ఉంటుంది.
నల్ల నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సమతుల్యముగా ఆమ్లాలను ఉంచుతాయి. అధిక రక్తపోటు ఉన్నవారు రోజు తింటే అదుపులో ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ కూడా పెంచడానికి ఈ నువ్వులు సహాయపడుతాయి. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.