karjura : ఖర్జూర ఫలం అద్భుతమైనది. ఈ ఫలంతో అనేక ప్రయోజనాలు ఉన్నవి. కనీసం రోజుకు రెండు తింటే చాలు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక వైద్యుడి వద్దకు పోవాల్సిన అవసరం కూడా ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే చలి కాలంలో ఖర్జురా తింటే ఏమవుతుందో అనే విషయాన్నీ కూడా ఆరోగ్య నిపుణులు ఈ విదంగా చెబుతున్నారు.
ప్రతి రోజు రెండు ఖర్జూరాలు తింటే శరీరంలో శక్తి సామర్ధ్యాలు పెరుగుతాయి. దీనిలో విటమిన్ ఏ, సి, పుష్కలంగా ఉంటాయి. ఈ విటమినులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మాన్ని ఆరోగ్యముగా ఉంచుతాయి. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం లు రక్తపోటును తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల్ని బలంగా ఉంచడానికి సహకరిస్తాయి.
ఖర్జూరాలు శరీరంలో ఇనుమును పెంచి రక్తహీనతను తగ్గిస్తాయి. శరీరంలో రక్తాన్ని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి. ఖర్జూరాల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని ఆరోగ్యముగా ఉంచుతాయి. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరిచి మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.