Home » Singareni : తెలంగాణ బొగ్గుగనులు సింగరేణికే దక్కాలి….సిపిఎం డిమాండ్

Singareni : తెలంగాణ బొగ్గుగనులు సింగరేణికే దక్కాలి….సిపిఎం డిమాండ్

Singareni : తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికే దక్కాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లాలోని సింగరేణి గనులపై సీపీఎం నాయకులు సంతకాల సేకరణ చేపట్టారు. కాసిపేట 2 గని, యాప, మల్కపల్లి, కోమటి చేను, ముత్యంపల్లి, కాసిపేట ప్రాంతాల్లో కార్మికులు, రైతులు, కూలీలతో సమావేశాలు నిర్వహించారు సీపీఎం నాయకులు.

ఈ సందర్బంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనులను కార్పొరేటర్లకు కట్టబెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపన్నిందని ఆరోపించారు. సింగరేణి గనులు కార్పొరేటర్ చేతిలో చేరితే సంస్థ భవిష్యత్తు అంధకారం కావడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కనుమరుగు కావడం ఖాయమన్నారు. అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అదానికి సింగరేణి గనులను అప్పగించడానికి కుట్ర జరుగుతోందని రవి ఈ సందర్బంగా ఆరోపించారు.

తెలంగాణలో ఉన్న బొగ్గు సంపద అంతా కూడా సింగరేణి మాత్రమే ఉత్పత్తి చేయాలన్నారు. అప్పుడే ఈ ప్రాంత నిరుద్యోగులకు అవకాశాలు వస్తాయన్నారు. బొగ్గు గనులపై ఆధారపడిన చిరు వ్యాపారులకు కూడా ఉపాధి దక్కుతుందన్నారు. వేలంపాటతో సంబంధం లేకుండానే సింగరేణికి బొగ్గు బ్లాక్ లను కేటాయించాలని రవి ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో
సిపిఎం నాయకులు దూలం శ్రీనివాస్, సిడం జంగుబాయితో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *