Fruit Water : మన శరీరాన్ని ఆరోగ్యముగా ఉంచాడనికి ఫలములు ఎంతో ఉపయోగపడుతాయి. అంతే కాదు వాటి రసాలు కూడా చాలా మేలు చేస్తాయి శరీరానికి. పండ్లతో కొందరు జ్యుస్ చేసుకొని తాగుతారు. మరికొందరు పళ్లనే కోసుకొని తింటారు. పండ్ల రసాలు శరీరానికి ఉపయోగపడుతాయి. వివిధ రకాల జబ్బులను అదుపులో ఉంచుతాయి. కాబట్టి మనం తినే ఫలాలు మనకు ఎంతగానో ఉపయోగ పడుతాయి.
సాధారణంగా మనం వంటలల్లో కూర తోపాటు అదనంగా చింతపండు రసాన్ని కూడా చేసుకుంటాం. కానీ ఆ రసంతో అనేక ఉపయోగాలు మన శరీరానికి ఎన్నో ఉన్నాయని తెలియదు. నిత్యం ఆ రసాన్ని వాడితే మన దేహానికి అనేక లాభాలు కలుగుతాయి. తీపి, పులుపు రుచితో ఉండే ఈ చింతపండు ను కర్జూర పండు అని కూడా పలు ప్రదేశాల్లో పిలుస్తారు. ఈ చింతపండులో విటమిన్ B, C లతోపాటు
యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఐరన్ అదికంగా ఉంటాయి.
చింతపండు రసాన్ని రోజువారి ఆహారంతోపాటు తీసుకుంటే బరువు తగ్గడానికి అవకాశం కూడా ఉంది. రోగనిరోధక వ్యవస్థ మెరుగు పడుతుంది. హానికరమైన ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. క్యాన్సర్‌తో సహా దీర్ఘకాలిక వ్యాధులను నివారించడానికి సైతం ఉపయోగ పడుతుంది. జీర్ణక్రియ సమస్యలను నివారిస్తుంది. ప్రేగులకు ఎలాంటి వ్యాధులు రావు. మలబద్దకం ఉన్నవారికి ఎంతో ఉపయోగ పడుతుంది. అంతేకాదు గుండె సమస్యలు రాకుండా కూడా ఎదుర్కొంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ రసం శరీరంలో ఏర్పడే మంటను అరికట్టడంలో చాలా సద్వినియోగం అవుతుంది. దీనిలో ఉండే మెగ్నీషియం ఎముకల గట్టితనానికి ఉపయోగపడుతుంది.