Eating Curd : ప్రతి రోజు ఉదయాన్నే చాలా మంది అల్పాహారం తిన్న తరువాతనే బయటకు వెళుతారు. లేదంటే మరి కొందరు చద్దన్నం తింటారు. ఇంకా కొందరయితే ఇడ్లి,పూరి, దోశ , వడ తింటారు. మరికొందరు పెరుగన్నం తింటారు. అయితే ఈ పెరుగన్నం ఎప్పుడు తినాలి. ఎప్పుడు తినకూడదు అనే పద్దతి కూడా ఉంది. పెరుగన్నం తింటే శరీరానికి జరిగే మేలు ఏమిటి. ఏ సమయంలో తినకూడదు. ఆ సమయంలో తింటే ఏమవుతుంది. పెరుగు అన్నం తింటే జరిగే మేలు ఏమిటి. పెరుగు చక్కర కలిపి తినవచ్చా. పెరుగు చక్కెర కలిపి ఏ సమయంలో తినవచ్చు. ఏ సమయంలో తినరాదు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం పూట చక్కర, పెరుగు కలిపి తినడం వలన మెదడు ఉత్సహంగా పనిచేస్తుంది. అంతే కాకుండా శరీరానికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడుతుంది. ప్రోటీన్, ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా, కాల్షియం కూడా ఉంటాయి. అంతే కాకుండా ఎముకలను, కడుపును ఆరోగ్యంగా ఉంచుతుంది.పాలు తాగే వారికి ఇబ్బందిగా ఉంటె పెరుగు తినవచ్చు. జీర్ణక్రియ వ్యవస్థ మెరుగవుతుంది. క్యాల్షియం, విటమిన్ బి-12, విటమిన్ బి-2, మెగ్నీషియం, పొటాషియం పోషకాలు సైతం పెరుగులో ఉంటాయి.
వేసవిలో తినడం వలన కడుపు భాగం చల్లగా ఉంటుంది. తక్షణమే బలాన్ని ఇస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పోషకం పేగులను బలంగా ఉంచడంతోపాటు కడుపులో ఇన్ఫెక్షన్లు మరియు అజీర్తిని నివారిస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. ఎముకలల్లో వచ్చే వ్యాధులను కూడా నివారిస్తుంది. కానీ పెరుగును అన్నంలో కానీ, చక్కెరలో కానీ ఎప్పుడైనా తినవచ్చు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల లోపు పెరుగును, ఏ పదార్థం తో కలిపి అసలే తినరాదని వైద్యులు చెబుతున్నారు.