Home » Control-Blood-Glucose : ఆ సుగంధ ద్రవ్యం… శరీరానికి ఉపయోగం

Control-Blood-Glucose : ఆ సుగంధ ద్రవ్యం… శరీరానికి ఉపయోగం

Control-Blood-Glucose : సిన్నమోమం వంశానికి చెందిన చిన్న సతత హరిత చెట్టు. ఆ చెట్టు సుగంధ ద్రవ్యాలకు పెట్టింది పేరు. ఆ చెట్టు కాండం నుండి వస్తుంది ఒక చెక్క. ఒక విదంగా చెప్పాలంటే ఆ చెక్క ముక్క బంగారం తో సమానమైనది అని చెప్పవచ్చు. కమ్మటి వాసన. ఘాటుగా ఉంటది. గుమ గుమ లాడుతది. కూరలు ఘాటు తనం కోసం, కూరలు రుచి, వాసన గుమ, గుమ లాడటానికి అంతో, ఇంతో స్తోమత ఉన్నవారు ఈ హరిత చెట్టు కాండం చెక్కను ఉపయోగిస్తారు. చాల పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటె అత్యంత ప్రసిద్దమైన మసాలా దినుసు అని కూడా చెప్పవచ్చు.

వంటలల్లో ఉపయోగించే మసాలా దినుసులు వైవిధ్యమైనవి. రుచిని పెంచడంలో తోడ్పడుతాయి. ఆరోగ్యముగా ఉండటానికి ప్రధాన కారకులు అవుతాయి. ప్రస్తుతం మనం వాడుతున్న మసాలా దినుసులల్లో దాల్చిన చెక్క ఒకటి. ఈ చెక్క షుగర్ పేషంట్స్ కు ఎంతో ఉపయోగపడుతాయి. షుగర్ ఉన్నవాళ్లకు ఒక ఔషధంలా ఉపయోగపడుతుందని కొందరు హోమియోపతి వైద్యులు కూడా చెబుతున్నారు. ఈ చెక్క ను ఉపయోగించడం వలన జలుబు, దగ్గు, తుమ్ముల నుంచి కూడా దూరం చేస్తుంది. శరీర బరువు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. గుండెను ఆరోగ్యముగా ఉంచడంలో దోహదపడుతుంది.

ఈ చెక్కతో ఎన్నో ఔషద గుణాలు కూడా ఉన్నాయి. దీనికి బ్యాక్టీరియాను నిరోధించే శక్తి కూడా ఉంది. దీనిలో విటమిన్ ఏ, సి, పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు కార్బోహైడ్రేట్లు ఇనుము, కాల్షియం, మెగ్నీషియం కూడా శరీరానికి కావాల్సినంత అందుతాయి. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారు పరిగడుపున ఒక గ్లాసు నీటిలో దాల్చిన చెక్క ఒక చెంచా పొడిని కలిపి తాగితే బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదేవిదంగా గుండెను ఆరోగ్యముగా ఉంచడానికి సహాయపడుతుంది. చేదు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. గోరువెచ్చని గ్లాస్ నీటిలో ఒక చెంచా పొడిని కలిపి తాగితే శరీరానికి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

కీళ్ల నొప్పులతో బాధపడే వారు ప్రతి రోజు ఒక అరా చెంచా పొడికి ఒక చెంచా తేనె కలుపుకొని తాగితే నొప్పులు తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ పొడి వాడితే ఎముకల అరుగుదల తగ్గుతుంది. ఈ చెక్కలో మాంగనీసు, డయాటరీ ఫైబర్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కూడా ఆరోగ్యానికి ఎంతో అవసరమైనవే.

 

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *