Neredu : కాలానికి అనుగుణంగా పండ్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కో సీజన్ లో ఒక్కో పండు మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. వేసవి ముగిసి, వానా కాలం వచ్చే సమయంలో నేరేడు పళ్ళు మార్కెట్లో వస్తుంటాయి. గతంలో ఇళ్లలో చెట్లు ఉండేవి. కానీ ప్రస్తుతం నేరేడు తోటలు ఉన్నవి. తోటల్లో పెంచడం వలన నేరేడు పళ్ళు పుష్కలంగా మార్కెట్లోకి వస్తున్నాయి. నేరేడు పళ్ళు తినడం వలన శరీరానికి చెప్పలేనంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నేరేడు పండ్లలో విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ సి, బి 12, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అల్లనేరేడు పండును రోజు తీసుకోవడం వలన రక్తంలో చక్కర అదుపులో ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
శరీరంలోని కణాలను ఆరోగ్యముగా ఉంచుతాయి. ఇనుము అధికంగా ఉంటుంది. రక్తహీనతను అదుపులో ఉంచుతుంది. బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండ తింటే బరువు తగ్గుతారు. ఆకలిని అదుపులో ఉంచుతుంది. దింతో అతిగా తినడం మానడానికి అవకాశం ఉంది. ఆరోగ్యకరమైన వ్యక్తి రోజు 200 గ్రాముల నేరేడు పండ్లు తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.