MP OYC : పెళ్లి సంబరాలు కావచ్చు. లేదంటే పండుగ సంబరాలు అయినా కావచ్చు. మరేదయినా సంబరాలు కావచ్చు. అక్కడ డీజే ఉండాల్సిందే. యువత డాన్స్ చేయాల్సిందే. డీజే ఉండి యువత లేదంటే అంత చప్పగానే ఉంటుంది. యువత ఉండి డీజే లేదంటే కూడా మరింత చెప్పగానే ఉంటది. ఇది నేటి తరం లో డీజే, యువత కలిస్తే ఒక సంబరం. కానీ గతంలో గ్రామాల్లో ఉన్న డప్పులతో పెళ్లిళ్లు, సంబరాలు జరిగేవి. కొంత ఉన్నత స్థానంలో ఉన్నవారు అయితే సన్నాయి, వాయిద్యాలతో పెళ్లిళ్లు, సంబరాలు, ఉత్సవాలు జరుపుకునేవారు. ఆ తరువాత బ్యాండ్ మేళాలు రావడం జరిగింది. ఇప్పుడు అవన్నీ పక్కకు పోయాయి. డీజే ఉందా , ఎగిరి గంతు వేయాల్సిందే అనే సంప్రదాయం చోటుచేసుకుంది.
సంబరం వరకు బాగానే ఉంది. కానీ ఆ డీజే వలన నష్టం కూడా స్పష్టంగానే కనబడుతోంది. కంటికి కనబడుతున్న నష్టం గురించి మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజేను శాశ్వతంగా నిషేదించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. డీజే సౌండ్ తో ప్రజలు తట్టుకోలేక పోతున్నారు. చెవులు చిల్లులు పడుతున్నాయి. అంతే కాదు యువత కూడా చెడిపోతుంది. ప్రజలకు నష్టం ఎక్కువగా ఉంది. పరీక్షా సమయాల్లో నిరుద్యోగులు, విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే డీజే ను శాశ్వతంగా మూసివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
మిలాద్ ఉన్ నబీ వేడుకలు జరుగుతున్న సందర్బంగ చార్మినార్ వద్ద డీజే తో యువత డాన్స్ చేస్తున్నారు. అదే సమయంలో డీజే బాక్స్ లు పేలిపోయి, మంటలు చెలరేగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో డీజేను శాశ్వతంగా బ్యాన్ చేయాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం విశేషం. తెలంగాణ లో డీజే కు అనుమతులు ఇవ్వరాదని, శాశ్వతంగా మూసివేయాలని ప్రభుత్వాన్ని కోరారు.