Anjaneya Swamy : రాజకీయ నాయకులు ఒకవైపు ప్రజలను నమ్ముకుంటారు. మరోవైపు దేవుణ్ణి కూడా నమ్ముకుంటారు. ఎన్నికల్లో పోటీచేయడానికి ముందు హోమాలు చేస్తారు. యాగం చేస్తారు. దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇష్టమైన దేవుళ్ళ వద్దకు వెళుతారు. అక్కడ ప్రత్యేక పూజలు చేసి పండితుల ఆశీర్వాదం తీసుకుంటారు. గెలిపించాలని దేవుణ్ణి వేడుకుంటారు. నామినేషన్ వేసేముందు కూడా బి- ఫారం తో గుడికి వెళ్లి పూజలు చేసి గెలిపించాలని ఇలవేల్పులను కోరుకుంటారు. ఎన్నికల ప్రచారంలో కనిపించే ప్రతి ఓటరు కూడా దేవుడే అవుతాడు. ఆ ఓటరుకు కూడా నాయకుడు దండం పెడుదారు. అవసరమైతే పాదాభి వందనాలు చేస్తారు.
కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం తన గెలుపుకు కారణం ఎవరో కూడా చెప్పేశారు. ఆయన గత కొన్నేళ్లుగా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటూన్నారు. కానీ కాలేకపోయారు. ఒక సందర్భంలో ఆయనకు విద్యుత్ షాక్ తగిలింది. ప్రాణాలతో బయట పడ్డారు. అప్పడు ప్రమాదం నుంచి బయట పడటానికి, ఇప్పుడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలవడానికి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి దయతోనేనని
స్పష్టం చేశారు.
2019 ఎన్నికల్లో రెండు ప్రాంతాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేశారు. ఏ ఒక్క స్థానం నుంచి కూడా గెలవలేక పోయారు.2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి పోటీచేశారు. సుమారు 70 వేల మెజార్టీ తో విజయం సాధించారు. గెలిచింది ఎవరు కాదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజక వర్గం నుంచి ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆయన విజయానికి సహకరించిన పిఠాపురం ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూనే తెలంగాణ రాష్ట్రము లోని కొండగట్టు ఆంజనేయ స్వామి దయతోనే తాను ఒకసారి ప్రాణాలతో బయట పడ్డానని, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచానని స్పష్టం చేశారు.