Boti Curry : మేక మాంసం, పొట్టేలు మాంసంలో వచ్చే బోటిని కూర వండుకొని చాలా మంది ఇష్టంగా తింటారు. బోటి అంటే మేక, పొట్టేలు పొట్ట భాగంలో వచ్చే వాటిని బోటి అంటారు. విందు బోజనాలల్లో ఈ బోటి కూరను ప్రత్యేకంగా వండుతారు. కొందరు ప్రత్యేకంగా అడిగి వేయించుకుంటారు.
మేక, గొర్రె పొట్ట భాగాల నుంచి వచ్చిన పేగుల బోటి కూరలల్లో బోలెడన్ని విటమిన్లు ఉంటాయి. ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. అదేవిదంగా బి విటమిన్, బీ6, బి12 విటమిన్లు కూడా బోటీలో అధికంగా ఉంటాయి.
ఐరన్, జింక్, సెలీనియం,కోలీన్ వంటి ఖనిజాలు సైతం పుష్కలంగా బోటీలో ఉంటాయి. ఈ బోటిలో కేలరీలు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. పుష్కలమైన ఖనిజాలు, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ తో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఇందులో ఉండటం విశేషం.
బోటిలో ఉండే ఐరన్ కారణంగా ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల పునరుత్పత్తి అవుతుంది . రక్తహీనత సమస్య ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో విటమిన్లు, ఖనిజాలుప్రధాన పాత్ర పోషిస్తాయి. బోటి కూడా నరాలకు చాలా మేలు చేస్తుంది. అదేవిదంగా కండరాలు మేలు చేస్తాయి. క్రమపద్ధతిలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది.