ram charan : ప్రముఖ నటుడు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై అభిమానులు సైతం ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చాలా రోజుల తరువాత రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ రాబోతోంది. శంకర్ దర్శకత్వం. సంగీత దర్శకుడు తమన్. ది సౌండ్స్ ఆఫ్ గేమ్ ఛేంజర్’ అనే వీడియో కూడా రిలీజ్ చేసి అభిమానుల్లో సంబరాన్ని నింపారు.
‘ ది సౌండ్స్ ఆఫ్ గేమ్ ఛేంజర్ ’ అనే పాటను చిత్రీకరించడంలో సినిమా పెట్టుబడిదారులు ఎక్కడ కూడా రాజీ పడటంలేదు. దాదాపుగా పది భాషలకు చెందిన డ్యాన్సర్లు ఈ పాటలో రామ్ చరణ్ పక్కన డ్యాన్స్ చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. ఈ పాటకు గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు. అదే విదంగా ఈ పాటని నకాష్ అజీజ్ పాడారు.
ఈ పాటను దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నృత్యాలతో చిత్రీకరించారు. గుస్సాడీ, చావు, ఘుమ్రా, గొరవర, కుమ్ముకోయ, రణప, పైకా, హలక్కీ, తప్పిట గుళ్లు, దురువా జానపద నృత్యాలతో ఈ పాటను చిత్రీకరించారు. ఈ ఒక్క పాట కోసం వెయ్యి మంది డ్యాన్సర్లు నృత్యం చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేసింది. వెయ్యి మందితో కలిసి తమ అభిమాన మెగా హీరో రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ ఈ నెల 30 తేదీన అభిమానుల ముందుకు రాబోతోంది.