dy cm pavan : ప్రముఖ తెలుగు సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దాదాపుగా ఏడాదిపాటు కెమెరా ముందుకు రాలేదు. ఆయన ఒప్పుకున్న సినిమాలు నిలిచి పోయాయి. వాటిని ఇప్పడు పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అధికారం లోకి కూటమి రాగానే మంత్రి పదవి చేపట్టారు. కొద్దిరోజుల నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పడు కాస్త తీరిక దొరకడంతో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడానికి సిద్ధమయ్యారు.
మొఘలాయిల పరిపాలనకు సంభందించిన కథ అధారంగా హరి హర వీరమల్లు సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా కథలో భాగంగా చార్మినార్, గోల్కొండ సెట్స్ ప్రత్యేకంగా వేశారు. ప్రస్తుతం సినిమా విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. మిగిలిన అంశాలను పూర్తి చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు.
చిత్ర బృందం తో పాటు సినిమా పెట్టుబడి దారులు హరిహర వీరమల్లు ను సాధ్యమైనంత మేరకు పూర్తి చేసి అభిమానులకు కానుకగా ఇవ్వాలని చూస్తున్నారు. ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించించి. సినిమాను వచ్చే ఏడాది అంటే 2025, మార్చ్ 28న విడుదల చేయనున్నామని సినిమా బృందం ప్రకటించింది. దింతో పవన్ అభిమానుల్లో పండుగ వాతావరణం ఏర్పడింది.