Home » Puspa: పుష్ప-2 టీజర్ వచ్చేస్తోంది ….

Puspa: పుష్ప-2 టీజర్ వచ్చేస్తోంది ….

Puspa: పుష్ప సినిమా మొదటి భాగం వరకే పరిమితం అనుకున్నారు అల్లు అభిమానులు. కానీ రెండో భాగం కూడా ఉందని దర్శకుడు సుకుమార్ ప్రకటించడంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోయింది.ఎట్టకేలకు పుష్ప-2 షూటింగ్ ప్రారంభం కావడంతో టీజర్ ఎప్పుడు వస్తుందా అని అల్లు అభిమానులు ఎదురుచూస్తున్నారు. అభిమానులు ఆశలకు తగ్గట్టుగానే టీజర్ ను భారీ ఎత్తున విడుదల చేయడానికి పుష్ప-2 నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.చిత్రాన్ని అతి తొందరలోనే విడుదల చేయడానికి షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతోంది.దర్శకుడు సుకుమార్ కళ్ళకు గజ్జెలు కట్టుకున్న పోస్టర్ విడుదల చేశారు.ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. తాజాగా విడుదల ఆయిన ఈ పోస్టర్ అల్లు అభిమానుల్లో జోష్ నింపింది.
టీజర్ ఏప్రిల్ -8 న విడుదల
పుష్ప-2 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ కు జోడిగా రస్మిక మరోసారి తన అందాలను ఆరబోయనుంది. సంగీతాన్ని దేవీప్రసాద్ అందించనున్నారు. నవీన్ యర్నేని,రవిశంకర్ సంయుక్తంగా మైత్రి మూవీ బ్యానరుపై నిర్మిస్తున్నారు. ప్రియమణి, అనసూయ, విజయ్ సేతుపతి,కీలక పాత్ర పోషిస్తున్నారు.ఆగష్టు-15న ప్రపంచ వ్యాప్తంగా పుష్ప-2 ను విడుదల చేయడానికి నిర్మాతలు ఈ పాటికే ప్రకటించారు.అభిమానుల కోరిక మేరకు ఈ నెల 8న టీజర్ ను విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *