Mohan Babu : టీవీ 9 జర్నలిస్ట్ రంజిత్ పై దాడి చేసింది మోహన్ బాబు. పైగా సమర్ధించుకోవడం. తన తప్పేమి లేదంటూ దాటవేత. ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ సంఘాలు నిరసన. మోహన్ బాబు పై పోలీస్ కేసు నమోదు. ఈ నేపథ్యంలో అరెస్ట్ కాకుండా ఉండేందుకు బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్ట్ వెళ్లారు. కానీ కోర్ట్ కూడా బెయిల్ పిటిషన్ ను కొట్టి వేసింది. ఇక మోహన్ బాబు అరెస్ట్ తప్పదు అనే అభిప్రాయాలు సైతం వ్యక్తమయ్యాయి.
ఎట్టకేలకు మోహన్ బాబు దిగి రాక తప్ప లేదు. స్వయంగా మోహన్ బాబు హాస్పిటల్ కు వెళ్లారు. జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించారు. రంజిత్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. కొట్టాలనే ఉద్దేశ్యం తనకు ఏమాత్రం లేదని తెలిపారు. ఆవేశంలో జరిగిన సంఘటనకు బాధపడుతున్నట్టుగా తెలిపారు.