Dy CM Pavan Kalyan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము డిప్యూటీ సీఎం గా కొణిదెల పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి ఏపీ ప్రజలకు వివరిస్తూ విస్తృత ప్రచారం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలు ఆయనకు బ్రహ్మ రథం పట్టారు. ఆయన విలువలు ఢిల్లీ దాక వెళ్లాయి. ఎపి ప్రజల్లో ఆయనపై నమ్మకం పెరిగింది. అంతే కాదు మాజీ సీఎం పరిపాలనతో తెలుగు సినీ పరిశ్రమ సైతం అనేక ఇక్కట్లను ఎదుర్కొంది. విధిలేని పరిస్థితుల్లో జనసేనకు అండగా నిలిచారు. కూటమి అధికారంలోకి రావడంతో సినీ పరిశ్రమలో ఆశలు చిగురించాయి. నీతి, నిజాయితీ, నమ్మకం కలిగిన నాయకుడు, అంతే కాదు మనవాడు అధికారంలోకి రావడంతో తెలుగు ఇండస్ట్రీలో ఆనందం వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో సినీ పరిశ్రమ నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు, సి.అశ్వినీదత్, ఏ.ఎం రత్నం, ఎస్.రాధాకృష్ణ, దిల్ రాజు, డివివి దానయ్య, బన్నీ వాస్, నవీన్ ఎర్నేని, నాగవంశీ, టిజి.విశ్వప్రసాద్ తదితరులున్నారు. ఉప ముఖ్యమంత్రితో నిర్మాతలు గంటకు పైగానే చర్చలు జరిపారు. తెలుగు పరిశ్రమతో పాటు, రాజకీయ వర్గాల్లో నిర్మాతలు కలిసిన విషయం పెద్ద చర్చగా మారింది. ఎందుకు కలిశారు. ఏ అంశాలపై చర్చ జరిగినది. ఏపీలో ఎక్కడ చూసిన ఇదే చర్చ జరగడం విశేషం.
సినిమా టికెట్ ధరలు పెంచే విషయం గురించి చర్చలు జరిగాయా అని నిర్మాతలను అడిగితే అది చాలా చిన్న విషయం. అంతకంటే పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. కేవలం అభినందించడానికి మాత్రమే కలవడం జరిగిందని కొందరు నిర్మాతలు చెప్పడం విశేషం. త్వరలోనే సీఎంను, డిప్యూటీ సీఎం ను అభినందించనున్నామని తెలిపారు. ఎందుకు కలిశారని కొందరు నిర్మాతలను అడిగితే సీఎం చంద్రబాబు నాయుడి అపాయింట్మెంట్ కోసమే డిప్యూటీ సీఎం ను కలవడం జరిగిందని సెలవివ్వడం విశేషం.