Ministers : ఆ కుటుంబలో ముందుగా ఒకే ఒక్కడు సినిమా రంగంలో ప్రవేశం. ఆ తరువాత మరొకరు. ఆ తరువాత ఇంకొకరు. ఇలా ముగ్గుగు ప్రవేశం. సినిమా రంగంలో వాళ్ళు ముగ్గురు మొనగాళ్లు. ఇప్పుడు ఆ ముగ్గురి తరువాత వాళ్ళ వారసులు వస్తున్నారు. నటనా రంగంలో తమదయిన ముద్ర వేశారు. రాజకీయ రంగంలో కూడా తమదయిన ముద్రవేశారు. ఇప్పుడు ఆ ముగ్గురు మొనగాళ్లు మంత్రులు కావడం విశేషం. వెళ్ళెవరో తెలిసే ఉంటది. అయినా తెలుసుకుందాం…..
2008లో, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు, 2009 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలల్లో పోటీచేసింది పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లు సాధించింది ప్రజారాజ్యం పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రజా రాజ్యం పార్టీ 2011లో కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. చిరంజీవి 2012 నుండి 2018 వరకు రాజ్యసభ ఎంపీగా కొనసాగారు. అక్టోబర్ 2012లో కాంగ్రెస్ పార్టీ కేంద్ర క్యాబినెట్‌లో పర్యాటక శాఖ మంత్రిగా భాద్యతలు చేపట్టారు. మే 2014 వరకు ఆ పదవిలో కొనసాగారు
2014 మార్చిలో నటుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (జేఎస్పీ)ని స్థాపించారు. టీడీపీ, బీజేపీ పార్టీలతో కూటమిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. విజయానికి కూటమి ఏర్పాటు ప్రధానమైనది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారం చేపట్టింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా భాద్యతలు చేపట్టారు.
నాగేంద్రబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. నాగబాబు నటుడిగా, నిర్మాతగా కొనసాగారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించగా పార్టీ గెలుపు కోసం కృషిచేశారు. తాజగా కూటమి ప్రభుత్వంలో మంత్రిగా భాద్యతలు చేపట్టబోతున్నారు.