Sridevi : తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీదేవి బాలనటిగా ప్రవేశించింది. తెలుగు చిత్ర పరిశ్రమకు మూల స్థంభమైన ఎన్టీ రామారావు తో బడిపంతులు సినిమాలో నటించి బాల నటిగా ఆరోజుల్లునే ప్రేక్షకులను మెప్పించింది. బాల నటి గా ప్రవేశించి అగ్ర హీరోలతో కూడా నటించి తన సత్తా ఏమిటో చూపించింది. ఎన్టీ రామారావు నుంచి మొదలు కొని అక్కినేని నాగేశ్వర్ రావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు తదితరులతో హీరోయిన్ గా తన నటనతో బోలెడంత మంది అభిమానులను సంపాదించుకొంది. పదహారేళ్ల వయసు సినిమాతో హీరోయిన్ గా చంద్రమోహన్ తో నటించి మెప్పించింది. చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి లో పోటా, పోటీగా నటించి తన సత్తా ఏమిటో చూపించింది.
కానీ ఒక అగ్ర హీరో తో మూడు పాత్రల్లో నటించింది. తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించింది. ఇంతకు ఆ ప్రధాన నటుడు ఎవరు ? ఆ నటుడితో ఈ సినిమాల్లో నటించింది ? సినిమా చరిత్రలో ఒక హీరోయిన్ ఒకే హీరోతో తల్లిగా, భార్యగా, ప్రియురాలిగా నటించలేదు. శ్రీదేవి ఒక్కరు మాత్రమే ఒకే ఒక్క హీరోతో మూడు పాత్రల్లో నటించడం విశేషం. ఆ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…..
శ్రీదేవి ” మూండ్రు ముదిచు ” సినిమాలో రజినీకాంత్ కు తల్లిగా నటించింది. టైగర్ సినిమాలో రజనీకాంత్ కు ప్రియురాలిగా, భార్యగా నటించింది. వీరిద్దరి కాంబినేషన్లో 20 కి పైగా సినిమాలు రావడం విశేషం.