Politics : తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకున్నవారు పరిశ్రమలు స్థాపించారు. మరికొందరు ఇంటికే పరిమితం అయ్యారు. కొందరు పార్టీలు స్థాపించారు. ఇంకొందరు వివిధ పార్టీల్లో చేరి ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ పదవులను పొందిన వారు సైతం ఉన్నారు. కానీ హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక టాప్ నటి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయాల్లోకి వచ్చేది లేదంటున్నారు. సాధారణ మహిళగానే ఉంటాను. కానీ రాజకీయ కండువా కప్పుకోనంటున్నారు. ఆమె ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…..
బాలీవుడ్ ను ఏలిన అలనాటి హీరోయిన్లలో ప్రీతీజింటా ఒకరు. ఆమె నటించిన చిత్రాలు ఎన్నో ప్రేక్షకులను మెప్పించాయి. తెలుగులో కూడా విక్టరీ వెంకటేష్ సరసన నటించారు. పెళ్లి తరువాత నటనకు దూరంగా ఉన్నారు. ఇటీవలనే ఆమె లాహోర్ 1947 సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చారు. పెళ్లి తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఆమె తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియా ద్వారా అందుబాటులోనే ఉంటున్నారు.
సోషల్ మీడియా ద్వారా ఒక అభిమాని ఇటీవల ఆమెను రాజకీయ ప్రవేశం గురించి అడిగారు. అందుకు ఆమె సున్నితంగా తన అభిమానికి బదులిచ్చారు. రాజకీయాలు అంటే నాకు ఇష్టం లేదు. రాజకీయాలపై నాకు పెద్దగా అవగాహన లేదు. నాకు కొన్ని పార్టీల నుంచి అవకాశాలు రావడం జరిగింది. కానీ వాటన్నిటిని తిరస్కరించాను. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇస్తామన్నారు. రాజ్యసభ సీట్ ఇస్తామన్నారు. కానీ వాటన్నిటిని తిరస్కరించాను అంటూ తన అభిమానికి ప్రీతిజింటా బదులిచ్చారు.