Students : మహిళలు పూజలు ప్రతిరోజూ చేస్తారు. ఉపవాసం ఉంటారు. అదే విదంగా పురుషులు కూడా ఉపవాసం ఉంటారు. దీక్షలు చేపడుతారు. దేవాలయాలకు వెళ్లి అక్కడ కూడా పూజలు చేస్తారు. కానీ విద్యార్థులు కూడా ఏడాదికి ఒక్క రోజు పూజ చేయడానికి, ఉపవాసం ఉండటానికి ఒక శుభ దినం ఉంది. అది చాలా మందికి తెలుసు. కొందరు పాటిస్తారు. మరికొందరు పాటించరు. ఆ శుభ దినం గురించి వేద పండితులు ఈ విదంగా చెబుతున్నారు.
ప్రతి ఏటా ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఆ శుభ దినం ఫిబ్రవరి 2. వసంత పంచమి. ఇది విద్యార్థులకు ఎంతో ముఖ్యమైనది. పవిత్రమైనది కూడా . ఏడాదికి ఒక్కసారి విద్యార్థులు భక్తి శ్రద్దలతో పూజలు చేసే రోజు వసంత పంచమి. సరస్వతి మాతను పూజించడం వలన జ్ఞానం, విజయం, ఆధ్యాత్మిక శ్రేయస్సును విద్యార్థులు పొందవచ్చు. వసంత పంచమి రోజున చిన్న పిల్లలు తమ విద్యా జీవితం ప్రారంభించడానికి శుభ దినంగా భావిస్తారు.
వసంత పంచమి రోజున విద్యార్థులు సరస్వతి దేవి కి ఇంటిలోనే ప్రత్యేక పూజలు చేయాలి. నైవేద్యం సమర్పించాలి. అమ్మవారిని నచ్చిన పూలతో అలంకరించాలి. హారతి ఇవ్వాలి. అమ్మవారి ఫోటో ఎదుట ఒక కొత్త నోట్ బుక్, కొత్త పెన్ను పెట్టి సరస్వతి శ్లోకం చదవాలి. ఆ రోజంతా పాలు, పండ్లు మాత్రమే తిని ఉపవాస దీక్ష చేపట్టాలి. తద్వారా సరస్వతి దేవి అనుగ్రహం పొంది విజయాలను పొందుతారని వేదంలో చెప్పబడింది.