Dance : బెంగుళూర్ లో జననం. అతనిలో ప్రతిభకు కొదవలేదు. చిన్ననాటి నుంచే డాన్స్ అంటే మక్కువ. క్రమశిక్షణ గల హిందూ కుటుంబం. అయినా కుటుంబంలో ఒక్కడే మతం మార్చుకున్నాడు. అసలు పేరు రమేష్ గోపి నాయర్. క్రిస్టియన్ మతం స్వీకరించాక పేరు రెమో డిసౌజా గా పేరు మార్చుకున్నాడు. అయినా ఎదో సాదించాలనే పట్టుదలతో బొంబాయి చేరాడు. చేతిలో ఉన్న డబ్బులు అయిపోయినవి. తినడానికి డబ్బులు లేవు. ఇంటికి పోనీ పరిస్థితి. రైల్వే స్టేషన్ లోనే నిద్ర. ఇప్పుడతను జాతీయ స్థాయిలో హిందీ చిత్ర పరిశ్రమకు పెద్ద డాన్స్ మాస్టర్ అయ్యాడు.
బొంబాయి వెళ్ళాక డిసౌజా ప్రతిభను ఎవరు గుర్తించలేదు. అనేక మంది సినిమా దర్శకుల వద్దకు వెళ్ళాడు. ఎవరు కూడా కనికరించలేదు. అవకాశాలు ఇవ్వలేదు. తిరస్కరణలే ఎక్కువయ్యాయి. అవమానాలు ఎదురైనాయి. పట్టుదలతో ఇంటికి వెళ్లకుండా బొంబాయి చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని అక్కడే ఉన్నాడు.
ఎట్టకేలకు దర్శకుడు అహ్మద్ ఖాన్ చేరదీసాడు. డిసౌజా ప్రతిభను గుర్తించాడు. తనకు సహాయకుడిగా పెట్టుకున్నాడు. అప్పటి నుంచి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ డిసౌజా దూసుకెళుతున్నాడు హిందీ పరిశ్రమలో. బాలీవుడ్ లో మధ్యంతరంగా నిలిచిపోయిన పలు సినిమాల పాటలకు డాన్స్ కంపోజ్ చేసి తన ప్రతిభను చాటుకున్నాడు. ఇప్పడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే తిరుగులేని మాస్టర్ అయ్యాడు.