Home » Johny master : జానీ మాస్టర్ ఎందుకలా మాట్లాడినాడు ?

Johny master : జానీ మాస్టర్ ఎందుకలా మాట్లాడినాడు ?

Johny master : సినిమా ఇండస్ట్రీ కు చెందిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదయినది. సెప్టెంబర్ 19న అరెస్టయ్యాడు. ఆ తరువాత బెయిలుపై విడుదల అయ్యాడు. జానీ కి వచ్చిన జాతీయస్థాయి అవార్డును కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

జానీ మాస్టర్ బెయిల్ నుంచి విడుదల అయిన తరువాత యధావిధిగా తన పనులు తాను చేసుకుంటున్నాడు. వివిధ భాషల్లో నిర్మాణమయ్యే చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఇటీవల జానీ మాస్టర్ ఇటీవల సోషల్ మీడియా లో కూడా తన సమాచారాన్ని కూడా పోస్ట్ చేస్తున్నారు. తన అభిమానులతో కూడా చాట్ చేస్తున్నాడు. ఇటీవల ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసాడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొందరు వ్యక్తులు తమ సొంత ఇమేజి పెంచుకోడానికి కోర్ట్ ఆదేశాలపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వారిని చూస్తుంటే భాదగా ఉందంటూ పోస్ట్ చేసాడు జానీ మాస్టర్. సంబంధంలేని కేసులతో నాకు, నా వ్యక్తిగత జీవితంతో ముడిపెడుతూ పోస్టులు పెడుతున్నారు. మీరెన్ని పోస్టులు పెట్టినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. న్యాయాన్ని నమ్ముకున్న నాకు అసలైన తీర్పు రాబోతోంది. ఆ తీర్పు వచ్చిన రోజున మీ నిజస్వరూపాలు కూడా ప్రజలకు తెలిసిపోతాయంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశాడు. అసలైన తీర్పు వచ్చే రోజు కూడా దగ్గరలోనే ఉంది. న్యాయమే గెలుస్తుంది. అప్పుడే నిజం కూడా అందరికి తెలుస్తుంది అంటూ జానీ మాస్టర్ పోస్ట్ చేశాడు.

Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *