Heroyin Swetha : సినీ పరిశ్రమను ఒక మ్యాజిక్ సిటీ అంటారు. ఎంత కష్టపడితే అంత సంపాదన. అందం, చదువు ఉన్న యువతులు అందరు ఈ రంగుల లోకంలోకి వస్తారు. పోటీని తట్టుకొని నిలబడాలంటే కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కోవాలి. తెలిసీ , తెలియక ఈ చిన్న పొరపాటు చేసినా అప్పటివరకు కష్టపడిన శ్రమ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. బాలనటిగా జాతీయ స్థాయిలో అవార్డు. వ్యభిచారంలో అరెస్ట్. అతి చిన్న వయసులోనే జాతీయ స్థాయి అవార్డు పొందినప్పటికీ, చేసిన చిన్న పొరపాటు తన ప్రతిభను నాశనం చేసింది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా ? మళ్ళీ నటిగా నిలదొక్కుకోడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తోందో తెలుసుకుందాం.
2002 లో నటి శ్వేతా బసు ప్రసాద్ బాల నటిగా బాలీవుడ్ లో రంగ ప్రవేశం చేసింది. కహానీ ఘర్ ఘర్ కీ అనే టీవీ షో ఆమెకు గుర్తింపు వచ్చింది. నటిగా కెరీర్ సంపాదించుకొంది. పలు వివాదాల్లో చిక్కుకుంది. కొత్తబంగారులోకం సినిమాతో తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ సినిమాతో తెలుగు హీరోయిన్ గా వార్తల్లోకెక్కింది. ఒక్క నటనతోనే శ్వేతా బసు సరిపెట్టుకోలేదు. డాక్యుమెంటరీ దర్శకురాలిగా, రచయిత్రిగా, నిర్మాతగా కూడా తన ప్రతిభను చాటుకొంది.
హిందీ పరిశ్రమలో మొదట షారూక్ ఖాన్ తో కలిసి నటించింది. 2014 వరకు పరిశ్రమలో ఉన్న పోటీని తట్టుకొని నిలదొక్కుకుంది. తిరుగులేని నటిగా తయారైనది. 2014 లో చేసిన ఒకే, ఒక్క చిన్న పొరపాటు ఆమె జీవితాన్నే నాశనం చేసింది. కానీ ఆమె తప్పు చేయలేదని కోర్ట్ తీర్పు ఇవ్వడంతో ఆమె సినీ ప్రపంచానికి సవాల్ విసరడానికి సిద్దమైనది. హైదరాబాద్ లో 2014 లో సెక్స్ రాకెట్ లో పట్టుబడింది. కానీ ఆమె తప్పు చేయలేదని కోర్ట్ తీర్పు రావడం ఆమెకు అదృష్టం కలిసొచ్చింది. ఇప్పుడు తన ప్రతిభను చాటుకోడానికి మరోసారి ఆమెకు అవకాశం వచ్చింది.