Heroien : సినిమా హీరోయిన్ లలో చాలా మంది తారలు బాల్యం వయసులో అడుగుపెట్టిన వారు ఉన్నారు. కొందరు బాల్యంతోనే ముగించిన వారు ఉన్నారు. మరికొందరు హీరోయిన్ గా స్థిరపడిన వారు సైతం ఉన్నారు. బాల్యం నుంచి వయసు పైబడినప్పటికీ నటించిన అందాల బామలు ఉన్నారు. కానీ ఒక హీరోయిన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒకే ఒక్క హీరోతో తల్లి, చెల్లి, కూతురు, ప్రియురాలుగా నటించి మెప్పించిన ఒకే ఒక్క అందాల ముద్దుగుమ్మ ఉన్నారు. ఆమె గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆమె ఎవరంటే …..
నటశేఖర, సూపర్ స్టార్ కృష్ణ తెలుగు చిత్రపరిశ్రమలో తిరుగులేని నటుడు. ఆయనతో కలిసి అందాల భామ శ్రీదేవి ముప్ఫయ్ సినిమాల్లో నటించింది. కృష్ణ ఒక్కరితోనే శ్రీదేవి 30 సినిమాల్లో నటించింది. ఎన్టీరామారావు, నాగేశ్వర్ రావ్, శోభన్ బాబు, కృష్ణం రాజు లతో కూడా శ్రీదేవి అన్ని సినిమాల్లో నటించలేదు.
శ్రీదేవి సూపర్ స్టార్ కృష్ణకు మా నాన్న నిర్దోషి సినిమాలో కూతురు గా నటించింది. దేవుడు లాంటి మనిషి సినిమాలో చెల్లిగా నటించింది. అదే విదంగా సమాజానికి సవాల్ సినిమాలో కృష్ణ కు తల్లిగా నటించింది. ఇక మిగతా 30 సినిమాల్లో కృష్ణకు శ్రీదేవి ప్రియురాలిగా నటించి మెప్పించింది.