Gold : బంగారం ధర రోజు, రోజుకు పైపైకి వెలుతోంది. ధర తగ్గుతుందనే ఆశలు ఎక్కడ కూడా కనబడుతలేదు. మధ్యతరగతి వారు కూడా కొనలేని పరిస్థితి లేదు. అంతర్జాతీయ మార్కెట్ కు ట్రంప్ భయం పట్టుకుంది. ట్రంప్ హెచ్చరికలు కూడా ఆందోళన కరంగా ఉన్నాయి. భంగం వాటిల్లవచ్చని ఇన్వెస్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు వడ్డీ రేట్లు తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ట్రంప్ విధానాలను చూస్తున్నవారు బంగారంపై పెట్టుబడికే మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్గెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో మన రాష్ట్రంలో కూడా బంగారం ధర రోజు, రోజుకు పెరిగిపోతుంది.
తులం బంగారం ధర ప్రస్తుతం 98 వేలు దాటింది. ఏప్రిల్ ఏడో తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ. 91,420 ఉండగా, ఏప్రిల్ 19న 10 గ్రాముల బంగారం ధర మార్కెట్ లో రూ.98,550 కు చేరింది. ఏప్రిల్ 30 న అక్షయ తృతీయ . ఈ రోజు హిందూ కుటుంబాలకు ఏంతో పవిత్రమైనది. ఖచ్చితంగా బంగారం కొనాలనే నమ్మకం ఉంది. అక్షయ తృతీయ రోజు తులం బంగారం ధర అక్షరాలా లక్ష రూపాయలకు చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.