YCP leaders : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదలతో సతమతమవుతోంది. ప్రజలు ఒక్క పూట తినడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా అనేక మంది ఇళ్లల్లో పొయ్యి వెలిగింది లేదు. కడుపులోకి నాలుగు ముద్దలు దిగింది లేదు. ప్రజలు కష్టపడిన సొమ్మంత వరద పాలైనది. రాష్ట్ర ప్రభుత్వం పై ఆర్థిక భారం తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం తనవంతు సహాయ, సహకారం అందిస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. ఇప్పుడు ఆయన పత్రిక సర్క్యులేషన్ ఏపీలో పడిపోయింది. వరదలో చిక్కుకున్న జనం భాద కంటే ఆయనగారికి పత్రిక కోసం పుట్టెడు భాదలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా మోకాళ్ళ లోతులో ఉన్న నీటిలోనే సంచరిస్తున్నారు. వరద భాదితులకు సహాయ, సహకారాలు అందిస్తూ, ధయిర్యం చెబుతున్నారు.
వరదతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు. ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం గడప, గడప తిరిగారు. ఇన్ని భాదలు పడుతుంటే అధికోవాల్సిన భాద్యత పవన్ కళ్యాణ్ కు లేదా అంటూ వైసీపీ నేతలు కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ వైసీపీ నేతల మాటలు పవన్ కళ్యాణ్ పట్టించుకోవడంలేదు.
ఆయన వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసు. ప్రజలు వస్తారు. బాధలు చెబుతారు. వారితో పాటు అభిమానులు తరలి వస్తారు. ఒకవైపు ప్రజలు, మరోవైపు అభిమానులు దూసుకు వస్తున్న నేపథ్యంలో అదుపుచేయడం సాధ్యం కాదు.
అందుకనే పవన్ కళ్యాణ్ పరోక్షంగా సహాయ, కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. పవన్ కళ్యాణ్ కు ఉన్న ఇమేజ్ వేరు. ఖర్చు పెట్టి జనాన్ని తెచ్చుకోవాల్సిన అవసరం అంతకూ లేదు. విజయవాడకు పవన్ వస్తున్నాడని తెలిస్తే చాలు అభిమానులు, జనం తండోప తండాలుగా తరలివస్తారు.
మాజీ సీఎం జగన్ మాదిరిగా జనాన్ని పిలిపించుకొని జై కొట్టించుకోవాల్సిన అవసరం లేదు. పది నిముషాలు ఉండి, ఫోటోలు తీయించుకొని వెళ్లిపోవడం జగన్ కు, వైసీపీ నేతలకు ముందునుంచి ఉన్న అలవాటే. అలాంటి సాంప్రదాయం పవన్ కళ్యాణ్ రక్తంలోనే లేదు. పవన్ కళ్యాణ్ తన కార్యాలయం నుంచే నాయకులు, కార్యకర్తలతో పాటు అభిమానుల ద్వారా సేవలు అందిస్తున్నారు. పరిస్థితి సద్దుమణిగిన తరువాత పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు సైతం కనబడుతున్నాయి.