Students : మంచిర్యాల జిల్లాలోని కేజీబీవీ పాఠశాల విద్యార్థినిలు అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారని, వెంటనే వారికి వైద్యపరీక్షలు నిర్వహించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు SFI జిల్లా నాయకులు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా SFI నాయకులు మాట్లాడుతూ జైపూర్(మ)కేజీబీవీ విద్యార్థినిలు ఫంగస్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నారని అన్నారు. తాము మరిన్ని పాఠశాలలను సందర్శించగా ఇదే సమస్యతో విద్యార్థినులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.
ఒక్క జైపూర్(మ) కేజీబీవీ స్కూల్ విద్యార్థినీలు సుమారు 30 మందికి పైగా ఫంగస్ ఇన్ఫెక్షన్ భారీన పడి ఇబ్బంది పడుతున్న విషయాన్ని జిల్లా కలెక్టర్ కు వివరించామన్నారు. కొంత మంది విద్యార్థినిల తల్లదండ్రులు వైద్యం చేయించదానికి ప్రైవేట్ గా వెళ్లినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. కావున తక్షణమే జిల్లా కలెక్టర్ , కేజీబీవీ డిపార్ట్మెంట్ అధికారులు జిల్లాలోని వసతి గృహాలన్నిటిని సందర్శించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మెరుగయిన వైద్యం అందించాలని వారు కలెక్టర్ ను ఈ సందర్బంగ కోరారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కార్యదర్శి ఈదునూరి అభినవ్, నస్పూర్ మండల కమిటి సభ్యులు హర్ష, ప్రదీప్, నిక్షిత తదితరులు పాల్గొన్నారు.