Congress : మందమర్రి పట్టణంలో శనివారం యూత్ కాంగ్రెస్ 65 వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా కేక్ కోసి యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆనందంగా జరుపుకున్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్బంగా
యూత్ కాంగ్రెస్ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి (ఎలక్టెడ్) నోముల రాజేందర్ గౌడ్, మందమర్రి యూత్ కాంగ్రెస్ మండల వైస్ ప్రెసిడెంట్ (ఎలక్టెడ్ ) మాయ తిరుపతి యాదవ్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి ని చేయడంలో యూత్ కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి పెద్దపల్లి పార్లమెంట్ స్థానంతో పాటు చెన్నూర్ అసెంబ్లీ స్థానాన్ని మరోసారి గెలిపించుకొని తీరుతా మన్నారు. రాబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎలక్షన్లో యూత్ కాంగ్రెస్ కు అవకాశాలు అందివస్తే పోటీచేసి తీరుతామన్నారు. అదే విదంగా స్థానిక ఎన్నికల్లో ప్రతి అభ్యర్థిని కూడా గెలిపించుకొని తీరుతామన్నారు.
అనంతరం పలువురు సీనియర్ నాయకులను యూత్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న షాహిద్, భుక్య రాజేష్ నాయక్, జావిద్, చెప్పకుర్తిశశిధర్, రామసాని సురేందర్, చిలుములమహేష్, ధనక్ సూరజ్, ధనక్ రాజేష్, జక్కుల తిరుపతి, కెక్కర్ల శ్రావణ్, మొగిలి నరేందర్, గెల్లు ప్రవీణ్, వికాస్, గట్టు అంకుష్, శ్రీను, మల్లేష్, సునీల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

by