Singareni : మంచిర్యాల జిల్లా లోని సీసీసీ కార్నర్ వద్ద ఈనెల 11న సాయంత్రం నాలుగు గంటలకు బిఎంఎస్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఆ యూనియన్ జిల్లా కార్యదర్శి మద్దూరి రాజు యాదవ్ ఆదివారం తెలిపారు. ఈ సభకు ముఖ్య అతిథి జాతీయ బొగ్గు పరిశ్రమల ఇంచార్జి కొత్త కాపు లక్ష్మారెడ్డి హాజరు కానున్నారు.
సభకు భారతీయ మజ్దూర్ సoగ్ (బి.ఎమ్.ఎస్) అనుబంధ సింగరేణి బొగ్గుగని కార్మికులు, మంచిర్యాల పరిసర ప్రాంత సంఘటిత, అసంఘటిత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. భారతీయ మజ్దూర్ సంగ్(బి.ఎమ్.ఎస్) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంటాల శంకర్తోపాటు ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, రత్నాకర్ మహానంద్, సంగెం లక్ష్మణ్, దుర్గం రాజమల్లు, మురుకుంట్ల మధు,లు పాల్గొన్నారు.