Home » BJP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మంచిర్యాల పర్యటనలో సమాచార లోపం

BJP : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మంచిర్యాల పర్యటనలో సమాచార లోపం

ముందస్తు సమాచారం ఎక్కడంటున్న కార్యకర్తలు
జిల్లా కమిటీపై రామచంద్రుడికి ఫిర్యాదు
పనిచేయని నేతలపై రామబాణం సిద్ధం

BJP : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పర్యటన మంచిర్యాల జిల్లాలో ఖరారైనట్టుగా పార్టీ శ్రేణులు తెలిపారు. ఆగష్టు 5న మధ్యాహ్నం రెండు గంటలకు మంచిర్యాల జిల్లా గూడెం దేవస్థానం వద్ద జిల్లా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. అనంతరం గూడెం దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు రామచంద్ర రావు. ఆ తరువాత లక్సెట్టిపేట కరీంనగర్ చౌరస్తాలోని SPR ఫంక్షన్ హాల్ లో రైతు సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కరీంనగర్ చౌరస్తాలోని శివాజి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అరిపించనున్నారు. అక్కడి నుంచి నేరుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశంతో పాటు, న్యాయవాదుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మందమర్రిలో పార్టీ శ్రేణులతో రోడ్డు పైననే కొద్దిసేపు ముచ్చటించనున్నారు. దింతో ఆయన జిల్లా పర్యటన ముగుస్తుంది.

సమాచారం లేదు …..

రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన ముందే ఖరారైనప్పటికీ జిల్లాలో పార్టీ శ్రేణులకు సమాచారం లేదు. ఆగష్టు 5న రానున్న నేపథ్యంలో 4 తేదీ వరకు కూడా పార్టీ వర్గాలకు సమాచారం కరువైనదని పలువురు సీనియర్ కాషాయం నేతలు జిల్లా కమిటీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన పై ముందస్తు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్న జిల్లా కమిటీ పనితీరుపై కొందరు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం ఇవ్వని జిల్లా పెద్దలు అధ్యక్షుడి పర్యటన ఏర్పాట్ల పై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి హోదా ఏర్పాట్లను రాష్ట్ర ఇంచార్జి హోదా కు తగినట్టుగా చేస్తారేమోనని కూడా కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేయడం విశేషం.

పూర్తి కాని కమిటీలు ….

మంచిర్యాల జిల్లా అధ్యక్షుడి పదవిని మాత్రం భర్తీ చేసుకున్నారు. మరి మండల, పట్టణ కమిటీలను ఎవరు భర్తీ చేస్తారని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ కమిటీలతో పాటు, పార్టీ అనుబంధ మోర్చా కమిటీలను సైతం భర్తీ చేయకపోవడం పై కూడా రాష్ట్ర చీఫ్ కు ఫిర్యాదు చేయడానికి పలుఫురు నేతలు సిద్ధమవుతున్నారు. బూత్ కమిటీ ల నిర్మాణం పై కూడా ఫిర్యాదులు ఇవ్వడానికి పలువురు సన్నద్ధ మవుతున్నారు. జిల్లా పార్టీ పనితీరుపై సమగ్ర నివేదికను తయారు చేస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. ఏది ఏమైనప్పటికి రాష్ట్ర అధ్యక్షుడు నిర్వహించే పదాధికారుల సమావేశంలో అంతర్గత విబేధాలు కూడా గుప్పుమనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

కార్యక్రమాలు అంతంతే ……

కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జిల్లా కమిటీ పూర్తిగా విఫలమైనట్టుగా పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై కూడా జిల్లా కమిటీ చేపట్టిన కార్యక్రమాలు సైతం కార్యకర్తలు ఆశించిన స్థాయిలో కనబడుట లేదంటున్నారు. జిల్లా కమిటీ మారు మూల మండలాల్లో పర్యటించిన సందర్భం ఎన్నడూ లేదంటున్నారు. పార్టీ అభివృద్ధి కోసం చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, వాటిని నిర్వహించడంలో జిల్లా కమిటీ ” మమ ” అనిపిస్తోందనే ఆరోపణలు సైతం పార్టీ వర్గాల్లో వ్యక్తం కావడం విశేషం.

Author

  • Editor : Ch . Parasu Ram, NIGAMA MEDIA Pvt Ltd , RNI No : 192138/2024, Date : 20-12-2024, Mancherial, Telangana-504208, Mobile : 9603505050.

    View all posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *