CPM : బిజెపి పార్టీ నాయకులతో పాటు ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు,కేంద్ర ప్రభుత్వం బిసి బిల్లుకు మతం రంగు పూసి అడ్డుకుంటున్నాయని సిపిఎం మంచిర్యాల జిల్లా కార్యదశి సంకె రవి ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో పార్టీ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ……
బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక నిబంధన, తెలంగాణ రాష్ట్రంలో మరో పద్దతి అవలంబిస్తూ ద్వంద వైఖరి బుద్దిని చూపిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ విధానాన్ని నిరసిస్తూ బీసీ రిజర్వేషన్ సాధనకై ఆగస్టు 10 న ధర్నాకు పిలుపునివ్వడం జరిగిందన్నారు.ఆగస్టు 10 న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే ధర్నా లో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల్సిందిగా అయన కోరారు.
ఈ కార్యక్రమంలో గోమసా ప్రకాష్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కామిల్లా జయరావు IRCP రాష్ట్ర నాయకులు, దుంపల రంజిత్ కుమార్ CITU జిల్లా కార్యదర్శి, K.ప్రేమ్ కుమార్ DYFI జిల్లా ఉపాధ్యక్షులు, దాసరి రాజేశ్వరి శ్రామిక మహిళా జిల్లా నాయకురాలు, BC,సామాజిక సంఘాల నాయకులు తాడురి పొశం, వేముల వీరస్వామి,కిషన్ రావ్,కుమార్,రాజేందర్, కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.