సమస్యల పరిష్కారంలో యాజమాన్యం విఫలం
తప్పనిసరి పరిస్థితుల్లో ఆందోళన తప్పదు
కాంపెల్లి సమ్మయ్య
Singareni : సింగరేణి బొగ్గుగని కార్మికుల అపరిష్కృత సమస్యల పరిస్కారం లో యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యంపై ఐఎన్టీయూసీ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు కాంపెల్లి సమ్మయ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గురువారం యూనియన్ ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలోని గనులు, డిపార్టుమెంట్ల వద్ద నిరసన కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్బంగా కాంపెల్లి సమ్మయ్య కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ….. యాజమాన్యం స్పందించి సకాలంలో సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు.
1. మెడికల్ అటెండెన్స్ రూల్స్ ను మార్చాలి.జులై 31న జరిగిన మెడికల్ బోర్డు లో కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఐఎన్టియుసి భావిస్తున్నది అందువలన ఆ బోర్డును రద్దుచేసి తిరిగి ఏర్పాటు చేయాలి 2. అండర్ గ్రౌండ్లో అన్ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ట్రేడ్ మెన్ మరియు ఈపి ఆపరేటర్లకు సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇవ్వాలని డిమాండ్ 3. ఎన్నో ఏళ్ల నాటి సొంతింటి కలను నిజం చేయడానికి ఏర్పాట్లు చేయాలి 4. కార్మికుడి సంవత్సర జీవితంలో మూడు నెలలు ఇన్కమ్ టాక్స్ కట్టడానికే సరిపోతున్నది అందువలన కనీసం అధికారుల మాదిరిగా పేర్క్స్ పై ఇన్కమ్ టాక్స్ మాఫీ చేయాలి
5. సింగరేణిలో రానున్న కొద్ది సంవత్సరాల్లో అనేక భూగర్భగనులు మూతపడే అవకాశం ఉన్నందున తక్షణం నూతన గనుల ప్రారంభానికి నిధులు కేటాయించాలి. 6.ప్రమాదాల నివారణకై వెంటనే సేఫ్టీ ట్రైపాడ్ మీటింగ్ ను ఏర్పాటు చేయాలి. 7. ఏరియాలో చాలా కోటర్లు శిథిలావస్థకు చేరినందున వెంటనే నూతన కోటర్ల నిర్మాణానికి ప్రత్యేక నిధులు కెటాయించాలి. 8. నూతన బదిలీ విధానం కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నందున ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్. 9. మెరుగైన క్యాడర్ స్కీమ్ విధానాన్ని ప్రవేశపెట్టి నూతన ప్రమోషన్ పాలసీని తీసుకురావాలి.
10. ఆసుపత్రులల్లో మందుల కొరత లేకుండా చూడాలి. ఏరియా ఆసుపత్రులల్లో 24 గంటలు ఒక వైద్యుడు తప్పనిసరిగా ఉండాలి. 11. 35% లాభాల వాటాను వెంటనే ప్రకటించాలని కోరుతున్నాం. 12. కార్మికుల మారుపేర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి. 13. ఉద్యోగాలను కోల్పోయిన డిస్మిస్డ్ కార్మికులకు మరొక అవకాశం ఇవ్వాలి 14. విజిలెన్స్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్న 3700 కేసులను ప్రత్యేక లోక్ అదాలత్ కు అప్పగించాలి 15. మహిళా కార్మికులకు ప్రత్యేకంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలి.