గనుల్లో కరువైన రక్షణ ఏర్పాట్లు
వైద్యం కూడా అంతంతే
రక్షణ, సంక్షేమానికి ప్రత్యేక నిధిలు కేటాయించాలి.
సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి
Singareni : సింగరేణి బొగ్గు గనుల్లో నిత్యం ఎక్కడో ఒకేచోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు కార్మికులు చనిపోతున్నారు. మరికొందరు గాయాల పాలవుతున్నారు. దింతో కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గని ప్రమాదాలు జరిగినప్పుడు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్న రికార్డులు ఎక్కడ కూడా కనబడుటలేదు. కాబట్టి జరుగుతున్నా ప్రమాదాలకు కారకులెవరని సీపీఎం మంచిర్యాల జిల్లా కార్యదర్శి సంకె రవి సింగరేణి యాజమాన్యాన్ని ప్రశ్నించారు. బుధవారం మందమర్రి సింగరేణి జీఎం కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ప్రమాదాలపై యాజమాన్యం తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం పర్సనల్ మేనేజర్ కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు.
1,జరిగిన ప్రమాదాలు,దాని కారణాలు,రక్షణ వ్యవస్థ పని తీరుపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. 2,తీసుకోవాల్సిన జాగ్రత్తల కోసం తక్షణమే అన్ని పర్మనెంట్,కాంట్రాక్టు యూనియన్లతో, నిపుణులతో, సీనియర్ కార్మికులతో సమావేశాలు ఏర్పాట చెయ్యాలి. 3,ప్రమాదాలకు బాధ్యులుగా స్థానిక అధికారి,సేఫ్టి అధికారి, ఏరియా జనరల్ మేనేజర్లపై చర్యలు తీసుకోవాలి. 4,డీజీఎంఎస్ తో జరిగే త్రిసభ్య కమిటి సమావేశంలో అన్ని కార్మిక సంఘాలను, కాంట్రాక్టు కార్మిక సంఘాలను పిలవాలి.5,ప్రతి షిఫ్ట్ లో సెప్టి అధికారులను నియమించాలి.6,పని ప్రదేశాల్లో పటిష్ఠమైన రక్షణ చర్యలు తీసుకోవాలి.7,ప్రతి విభాగం వద్ద ప్రాథమిక వైద్యంతో పాటు,అంబులెన్స్ లు,స్త్రేచ్చర్లు, ఆక్సిజన్,ఫస్ట్ యిజ్ స్టేషన్ ఏర్పాటు చెయ్యాలి 8,బెల్లంపల్లి,రామకృష్ణ పూర్ ఏరియా ఆసుపత్రిలల్లో అన్ని రకాల వైద్య నిపుణులతో పాటు, తగినంత సిబ్బందిని నియమించాలి. 9,ఉత్పత్తి,లాభాలే కాదు కార్మికులు,వారి కుటుంబాలు,ప్రాణాలు, సంక్షేమం మాదే అనే విధంగా యాజమాన్యం వ్యవరించాలి. 10,ప్రమాదాలు జరిగినప్పుడు అంబులెన్స్ తో పాటు డాక్టర్లను ప్రమాదం జరిగిన ప్రాంతానికి పంపించాలి. 11,కార్మికులకు రక్షణ మరియు సంక్షేమానికి నిధులను పెంచాలి.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోమసా ప్రకాష్,బోడెంకి చందు, జిల్లా కమిటీ సభ్యులు దూలం శ్రీనివాస్,గుమసా అశోక్,సామల ఉమ రాణి, నాయకులు దాగం శ్రీకాంత్, G.మహేందర్, సిడం సమ్మక్క,B.రమాదేవి,నిర్మల ,సిడం జంగు బాయి, K.రాజేశం, రాజలింగు, పోశం తదితరులు పాల్గొన్నారు.