Tirumala : తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అంటే భక్తులకు ఏంతో ఇష్టం. దర్శనం అనంతరం లడ్డు ప్రసాదం కోసం భక్తులు అనేక ఇబ్బందులు పడుతుంటారు. కోరినన్ని లడ్డూలు కావాలంటే కష్టం. అందుకనే భక్తుల కోరికను తీర్చడానికి దేవస్థానం కమిటీ కొత్త నిర్ణయాన్ని తీసుకొంది.
కియోస్క్ పద్దతిని అమలుచేస్తున్నారు టీటీడీ అధికారులు. భక్తులు తమ దర్శనం టికెట్ నెంబర్ ను కియోస్క్ లో నమోదు చేయాలి. కావాల్సిన లడ్డూలకు తగిన విదంగా నగదును యుపీఐ ద్వారా చెల్లించాలి. కియోస్క్ ద్వారా వచ్చిన రశీదును వీటికోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్ లో అందజేస్తే లడ్డూలు అందిస్తారు.
దర్శనం టికెట్ లేని భక్తులు తమ ఆధార్ కార్డు నంబర్ నమోదు చేసి రెండు లడ్డూలను పొందడానికి టీటీడీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరికొద్ది రోజుల్లోనే రెండు నుంచి నాలుగు లడ్డూలను ఇవ్వనున్నట్టుగా అధికారులు ప్రకటించారు.